జూనియర్ ఎన్టీఆర్ గుండెల్లో బాధ

మీరు హీరోగా విజయం సాధించకపోతే నందమూరి వంశం మిమ్మల్ని కలుపుకుని ఉండేదా అన్న ప్రశ్నకు ఆయన ఆవేదనను చంపుకుని జావిబివ్వడం, పైకి నవ్వులు కురిపించడం తెలిసిందే. కుటుంబాలు దాదాపు పదకొండేళ్ళ పాటు కలవకుండా ఉండడానికి పరిస్ధితుల ప్రభావమే అనుకోవచ్చు కదా, ప్రతి దానినీ నెగిటివ్ గా తీసుకోలేం కదా అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
తండ్రి హరికృష్ణ తనను బాగా చూసుకునేవారని, అయనంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన్ చెప్పుకొచ్చారు. కుటుంబ పోషణలో ఆయన పాత్ర ప్రధానమని అంగీకరించారు. నందమూరి కుటుంబంలో అపార్ధాలు రావడం పరిస్ధితుల ప్రభావమే తప్ప ఇందులో ఎవరి తప్పూ లేదన్నారు.
నందమూరి ప్రధాన కుటుంబం తనను, తన తల్లిని పదకొండేళ్ళ పాటు దూరంగా పెట్టారన్న విషయాన్ని ఈ సందర్భంగా జూనియర్ అంగీకరించడం విశేషం. తన చిన్నతనంలో బాగా జ్వరంగా ఉన్నప్పుడు తాత ఎన్టీఆర్ పిలిపించుకుని ఆప్యాయంగా మాట్లాడ్, తన పేరును తారక రామ్ నుంచి తారక రామారావుగా మార్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. తన తల్లిని, ఆమె వంట రుచిని అప్పుడే ఎన్టీఆర్ చూశారని జూనియర్ చెప్పారు. జూనియర్ గనుక సినిమాల్లో సక్సెస కాకుండా ఉంటే ఎన్టీఆర్ కుటుంబం ఆయనను అలాగే ఉంచేదేమో. ఆ విషయం ఎవరికి తెలిసి ఉండేది కాదేమో. చరిత్ర గర్భంలో ఎన్నో రహస్యాలు, ఎన్నో దాపరికాలు. కొన్నే బయటపడుతూ ఉంటాయి.












Click it and Unblock the Notifications