యువ 'బాబు'గా లోకేష్!

చంద్రబాబులో ఆ తర్వాత మార్పులు వచ్చాయి. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాల్లో, ఎన్టీఆర్ మెమోరియల్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాల్లో లోకేష్ ను ప్రవేశపెట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు నగరంలో లేనప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పార్టీలోని ముఖ్య నాయకులు పాల్గొనేవారు. ఈ ఏడాది మాత్రం లోకేష్ ముఖ్య అతిధిగా హాజరు కావడం విశేషం. నగదు పథకం మీద అధ్యయనం చేసి రమ్మని చంద్రబాబు కుమారుడిని విదేశాలకు పంపడమే కాక అందుకు విశేష ప్రాచుర్యం కల్పించారు. మహాకూటమి ఈసారి అధికారంలోకి రాకపోతే ఎన్టీఆర్ కుటుంబసభ్యులకు తన మీద ఆగ్రహం కలిగే అవకాశముందని, లోకేష్ కు పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తే వారు మౌనంగా ఉండిపోతారని, పైగా తన అల్లుడికి ప్రాధాన్యం ఇచ్చినందుకు బాలకృష్ణ ఆనందిస్తారని చంద్రబాబు అంచనా.
ఎన్నికల ఫలితాలను బట్టి పార్టీలో లోకేష్ పాత్ర ఆధారపడి ఉంటుంది. మహాకూటమి అధికారంలోకి వస్తే లోకేష్ పాత్ర పార్టీలో నామమాత్రంగానే ఉంటుంది. అతను తండ్రి నీడ వెనుక ట్రెయినింగ్ అవుతాడు. రాష్ట్రంలో మహాకూటమి అధికారంలోకి రాకుండా కేంద్రంలో మూడో ఫ్రంట్ కు అవకాశమొస్తే చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతారని పార్టీ నాయకుల అంచనా. అప్పుడు రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను లోకేష్ పర్యవేక్షిస్తారని తెలుస్తోంది.
పెళ్ళి కాకముందు నారా లోకేష్ కు సొంత వెబ్ సైట్ ఉండేది. ఆ సైట్ లో ఆయన అభిరుచులు ఆశయాల గురించి అనేక అంశాలు ఉండేవి. పెళ్ళయిన తర్వాత ఆయన ఆ సైట్ ను ఎత్తేశారు. ప్రజా జీవితంలోకి అంటే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంతోనే ఆయన పాత సైట్ ను ఎత్తేసి, కొత్త సైట్ తో ముందుకు రాబోతున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications