ఎన్టీఆర్ మందు కొట్టే..?

ntr
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ కీ ఏక్సిడెంట్ కావటానికి గంటముందు మందు పార్టీలో పాల్గొన్నాడంటూ అన్ని ఛానెల్స్ వారు వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఆ వార్తకు బలం చేకూర్చటానికి ఓ వీడియో క్లింప్పింగ్ ని సైతం ప్రసారం చేస్తున్నారు. దాంతో ఎన్టీఆర్ ఏక్సిడెంట్ కి కారణం ఫుల్ గా త్రాగి డ్రైవ్ చేయటమేనని మరో వివాదం మొదలైంది.తాజాగా ఇంటర్నెట్లో దొరికిన ఓ వీడియో క్లిప్పింగ్ ఆధారంగా టీవీ ఛానెల్స్ వారు ఈ విధమైన నిర్ధారణకొచ్చారు. సెల్ ఫోన్ లో దొరికిన ఈ క్లిప్పింగ్స్ లో ఎన్టీఆర్ రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ జోరుగా పాట అందుకున్నారు. అతనితో పాటు రాజీవ్ కనకాల,బబ్లు,రాజా వంటి అతని సన్నిహితులు ఉన్నారు. ఈ మందుపార్టీని ఉగాదికి తమ ఇంటికి వెళ్తున్న సందర్భంగా ఉషారుగా చేసుకున్నట్లు చెప్తున్నారు.

అయితే పోలీసులు ఈ దిసగా కేసు నమేదు చేయకపోవటం వల్లే దర్యాప్తు జరపలేదని అంటున్నారు. ఇక ఈ వీడియో క్లిప్పింగ్ ని కరెక్టే అనేందుకు అంతకుముందు ఏక్సిడెంట్ రోజు చూపిన క్లిప్పింగ్స్ చూపుతూ అందులో ఎన్టీఆర్ వేసుకున్న డ్రస్ ని ఈ కొత్త క్లిప్ లో ఎన్టీఆర్ డ్రస్ తో పోల్చుతున్నారు. రెండు ఒకటే అని నిర్ధారణ చేసి ఎన్టీఆర్ త్రాగే డ్రైవ్ చేసాడని నిర్ధారణ చేసారు. అంతేగాకుండా సూర్యాపేట ఎస్సై వివరణ తీసుకుని మరీ ఈ విషయాన్ని ధృవీకరించే ప్రయత్నం చేసారు. అయితే ఆ వీడియో క్లిప్పింగ్ సెల్ ఫోన్ తో తీసినది కావటం విశేషం. అంతేగాక ఆ క్లిప్ లో కనపడుపతున్న పార్టీ ఆ రోజుది కాదని అతని స్నేహితులు ఖండిస్తున్నారు. ఇక ఇవన్నీ ఇలా ఉంటే రీసెంట్ గా అతని వద్ద గొడవపడి మానేసిన మేనేజర్ సుకుమార్ ఈ క్లిప్స్ ని నెట్ లో పెట్టాడని అంతటా వినపడటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+