హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డేర్ డెవిల్ పవన్

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
హైదరాబాద్: ''అతి పెద్ద దొంగ వైఎస్ రాజశేఖరరెడ్డే" అని కరీంనగర్ జిల్లాలో నేడు వ్యాఖ్యానించడం ద్వారా పవన్ కల్యాణ్ తన ధైర్యాన్ని చాటుకున్నాడు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల మీద అసహ్యంతో అన్న చిరంజీవి దారిలో రాజకీయాలకు వచ్చిన పవన్ కల్యాణ్ ది సినిమాల్లో లాగానే రాజకీయాల్లోనూ విలక్షణ శైలి. చిరంజీవి మెత్తగా మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ వృద్ధ, వ్యర్ధ, అవినీతిపరులైన రాజకీయ నాయకుల పంచెలు ఊడదీసే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి.

ఒకప్పుడు తనతో సినిమా తీసి బాగా నష్టపోయిన బావ అల్లు అరవింద్ అక్కడా ఇక్కడా విమర్శలు చేయడంతో మనస్ధాపం చెందిన పవన్ కల్యాణ్ నాలుగేళ్ళ క్రితం ఒక సినిమా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చి అరవింద్ దుమ్ము దులిపాడు. ఆయన నష్టపోయిన డబ్బును తిరిగి ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించాడు. ఆనాడే అన్పించింది అతనిది సత్యాగ్రహమని.

ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన లౌక్యానికి తావు లేకుండా ముందుకు సాగిపోతున్నారు. చిరంజీవి నుంచి రాజకీయ వారసత్వం పొందాడన్న విమర్శలకు తావు లేకుండా పవన్ ఎన్నికల ముందే తనదంటూ ఒక ఓటు బ్యాంకును సృష్టించుకుంటున్నారు. అయితే దూకుడు ధోరణి ఒక్కోసారి లాభం చేస్తుంది కానీ కొన్ని సార్లు నష్టం కలిగిస్తుందన్న విషయాన్ని పవన్ గ్రహించాలి. ఆయన ఇప్పటి లాగానే మేధావులతో, సోషల్ సైంటిస్టులతో, సామాజిక న్యాయం గురించి ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తున్న ప్రముఖులతో మరింతగా కలిసి చర్చిస్తూ ముందుకు సాగవలసిన అవసరం ఉంది. మందకృష్ణ మాదిగ చెప్పినట్టు చిరంజీవి కంటే పవన్ కల్యాణ్ కే అణగారిన కులాలు, వర్గాలు, సామాజిక న్యాయం మీద ఎక్కువ అవగాహన ఉన్నట్టు కన్పిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X