పురంధరేశ్వరి సమస్య

Purandeswari
హైదరాబాద్: సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైన పురంధరేశ్వరికి ఇప్పుడు సీటు సమస్య వచ్చి పడింది. ఆమె స్ధానమైన బాపట్ల రిజర్వుడుగా మారడంతో ఆమె మరో స్ధానం వెదుక్కోవలసిన అవసరం ఏర్పడింది. ఆమె మొదట్లో గుంటూరు స్ధానం వైపు దృష్టి సారించినా, అక్కడ కమ్మ కులానికి చెందిన రాయపాటి సాంబశివరావు సిట్టింగ్ ఎంపీగా ఉండడంతో కమ్మ కుల పెద్దలు ఆ స్ధానం వైపు చూడవద్దని పురంధరేశ్వరికి సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ స్కీనింగ్ కమిటీ ఆమెకు వైజాగ్ ఎంపీ టికెట్ ఇవ్వడానికి సిద్ధపడినా ఆమె అక్కడి నుంచి పోటీచేయడానికి ఇష్టపడడం లేదు. వైజాగ్ లో బీసీలు, కాపులు అధిక సంఖ్యలో ఉండడంతో ఆమెకు ఆక్కడి నుంచి గెలవలేనేమోనన్న భయం పట్టుకుంది. తనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆమె మంకు పట్టు పట్టారు. అక్కడ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సిటింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనను తప్పించి ఈమెకు టికెట్ ఇవ్వడానికి హై కమాండ్ సంశయిస్తోంది. పైగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెడ్లు మూడు లక్షల మంది ఉన్నారు. వారు కాంగ్రెస్ కు, రెడ్డి అభ్యర్ధికి మాత్రమే ఓటేస్తారు. కమ్మవారు అక్కడ దాదాపు లక్ష మాత్రమే. ఆ టికెట్ వచ్చినా పురంధరీశ్వరి గెలవడం కష్టమే.

ఎన్టీఆర్ కుటుంబంలో అందరి నోటా "చిన్నమ్మ" అని పిలిపించుకునే దగ్గుబాటి పురంధరేశ్వరి రాజకీయాల్లో అంత ఎత్తున ఎదిగి ఇప్పుడు నేల చూపులు చూడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడానికి ఎన్టీఆర్ కొడుకులను, అల్లుడు దగ్గుబాటిని దగ్గర చేసుకున్న చంద్రబాబు ఆ తర్వాత హరికృష్ణను, దగ్గుబాటిని దూరం చేసుకున్నారు. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ కు బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీలోకి దగ్గుబాటి దంపతులు చేరిపోయి ప్రజాసేవ చేస్తున్నారు. భార్య ఎంపీగా, భర్త ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఎంతో అధ్యయనం, అనుభవం గల పురంధరేశ్వరి ఎంపీ అయిన కొంత కాలానికే కేంద్ర సహాయ మంత్రి ఆయ్యారు. సోనియా గాంధీ కుటుంబానికి చేరువయ్యారు. మంచి ప్రసంగాలు చేసి గొప్ప పార్లమెంటేరియన్ గా పేరు తెచ్చుకున్నారు. అయినా ఆమెకు ఇప్పుడు వచ్చిన టికెట్ సమస్యని హైకమాండ్ తీర్చలేకపోతోంది.

చివరిగా ఒక్క మాట: ఆమె ఎన్టీఆర్ కూతురు కాకపోయి ఉంటే వంటింటికో, రత్నాల వ్యాపారానికో పరిమైతమై ఉండే వారు. ఎన్టీఆర్ కూతురు కావడం వల్లనే ఆమెకు జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర మంత్రి పదవి లభించింది. అయితే వైస్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ కు చంద్రబాబు స్పాట్ పెట్టినప్పుడు భర్త డాక్టర్ దగ్గుబాటికి వీర తిలకం దిద్ది పంపించిన ఘనత పురంధరేశ్వరిదని విమర్శలు ఉన్నాయి. పురంధరేశ్వరి వల్ల నిజంగా కాంగ్రెస్ లాభపడిందా? గత ఎన్నికల్లో ఓకటి రెండు జిల్లాల్లో ఆ ప్రభావం ఉంటే ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆమె ప్రభావం దాదాపు శూన్యం. ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ పార్టీల్లో చేరి వెలుగులో ఉంటూ మొత్తంగా తమ కుటుంబం శ్రేయస్సు చూసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+