రాహుల్ పై హీరోయిన్ల గురి

Rahul Gandhi
హైదరాబాద్: అవివాహితుడైన రాహుల్ గాంధీపై బాలీవుడ్ హీరోయిన్లు మనసు పారేసుకుంటున్నారు. మూర్తీభవించిన మానవత్వం, నిష్కల్మషమైన హృదయం, కాబోయే ప్రధాని అన్న అభిప్రాయం ఉండడంతో ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయ్యాడు.

బాలీవుడ్‌ భామ దియామిర్జా తన మనసులో రాహుల్‌ గాంధీపై గూడుకట్టుకొని ఉన్న ప్రేమను ఈ విధంగా వెలి బుచ్చింది. "ప్రజలను ప్రభావితం చేసే అద్భుతమైన నాయ కత్వ లక్షణాలు రాహుల్‌ గాంధీకి ఉన్నాయి. అంతేకాదు అతి నెమ్మదస్తుడు. నిర్మలమైన, నిష్కలంకమైన మనసు ఆయనది. చిన్న వయస్సులోనే కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌ తన నాయకత్వ పటిమతో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఆయనంటే నాకెంతో అభిమానం, ఇష్టం... ఐ లవ్‌ హిమ్‌..." అని తన మనసులోని మాటను బయటపెట్టింది.

ఈ సంఘటనతో ఆ కార్యక్రమానికి హాజరైనవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తన అందచందాలతో కుర్రకారు మదిని ఇట్టే దోచేసుకునే దియామిర్జా, మిస్‌ ఏషియా పసిఫిక్‌, మిస్‌ ఇండియా (2000)గా ఎన్నికైన హైదరాబాదీ ముద్దుగుమ్మ. ఆ తరువాత 'రెహనా హై తెరే దిల్‌ మే" చిత్రంతో బాలీవుడ్‌ రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం హిట్‌ కొట్టడంతో బాలీవుడ్‌లో అవకాశాలు అందిపుచ్చుకొని 'దమ్‌", 'దస్‌", 'పరినీత", 'ఫిర్‌ హేరా ఫెరి", 'లగేరహో మున్నాభాయ్‌" లాంటి చిత్రాలతో బాలీవుడ్‌తో తన సత్తా చాటుకుంది. ఇదిలా ఉండగా ఈ విషయంపై రాహుల్‌ గాంధీ ఇంతవరకు పెదవి విప్పలేదు. ఈ సంఘటనపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో వేచిచూడాల్సిందేమరి.

అయితే రాహుల్‌ గాంధీపై బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు మనసుపారే సుకోవడం కొత్తమీకాదు. ఇంతకుముందు కూడా కొందరు హీరోయిన్లు ఈ చాక్లెట్‌ బాయ్‌, యంగ్‌ ఛార్మింగ్‌ పొలిటీషియన్‌ పట్ల తమకున్న ఇష్టాన్ని భాహాటంగానే ప్రకటించారు. చూడగానే ఎంతో ఆకర్షనీయంగా, అమ్మా యిల మనసును ఇట్టే ఆకర్షించే విధంగా ఉండే ఈ యంగ్‌ పార్లమెంట్‌ మెంబర్‌పై ఉన్న ఇష్టాన్ని ప్రకటించారు కొందరు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+