విజయవాడలో రియల్ ఎస్టేట్ 20 శాతం వృద్ధి!

Prakasam Barrage
హైదరాబాద్: విజయవాడ నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ ఉందా? రాష్ట్రం ఎన్ని ముక్కలవుతుందో, రాజధాని ఏదవుతుందో తెలియని ప్రస్ధుత స్ధితిలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా ఒకటికి పదసార్లు ఆలోచించుకోవాలి. అయినా విజయవాడలో ఇళ్ళ స్ధలాల ధరలు పెరగడం దేనికి నిదర్శనం? ఎప్పటికైనా ఆంధ్రుల రాజధానిగా విజయవాడ- గుంటూరు ప్రాంతం ఉంటుందని బలంగా నమ్ముతున్న వారు అక్కడ రెండు వంద్ల గజాల ప్లాటైనా కొని పెట్టుకోవాలనుకుంటున్నట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. చాలా మంది రియల్టర్లు ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాలకు తమ వ్యాపారాలను విస్తరించారు. తెలంగాణకు అనుకూలంగా చిదంబరం తొలి ప్రకటన చేసినప్పుడు ప్రారంభమైన బూమ్, తెలంగాణ మంత్రులు రాజీనామాలు చేసి ఢిల్లీ చేరుకోవడంతో బలపడింది.

హైదరాబాద్ తో పోలిస్తే విజయవాడ, గుంటూరుల్లో ల్యాంట్ లిటిగేషన్లు బాగా తక్కువ. విజయవాడ-గుంటూరుల మధ్య దూరం పాతిక కిలోమీటర్లే. నిజానికి వీటిని జంట నగరాలు అనవచ్చు. విజయవాడ తూర్పు దిశగా (బందరు రోడ్డు) 25 కిలో మీటర్ల వరకు విస్తరించింది. పడమర దిశగా (హైదరాబాద్ రోడ్డు) ఇబ్రహీం పట్నం వరకు పాకింది. అంటే పొడవుగా సర్పాకారంలో విస్తరించింది. ఇక మీదట ఆ రెండు దిక్కులా పెరగడానికి అవకాశం లేదు. అందువల్ల ఇటు ఉత్తరానికి గన్నవరం వరకు, అటు దక్షిణానికి మంగళగిరి దాటి గుంటూరు వరకు పెరగడానికి అవకాశముంది. అందు వల్ల ఈ రెండు వైపులా వెంచర్లు వస్తున్నాయి. గన్నవరం-రామవరప్పాడు ప్రాంతాల్లో ఎల్ అండ్ టి ఐటి పార్కు రూపుదిద్దుకుంటోంది.

విజయవాడలో ఫ్లాట్స్ నిర్మాణం కూడా బాగా పెరుగుతున్నట్టు బిల్డర్ గిరిధర్ ప్రసాద్ గుప్తా చెప్పారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ తగ్గిందని ఆంధ్రప్రదేశ్ బిల్డర్స్ ఫోరం అధ్యక్షులు శేఖరరెడ్డి కూడా అంగీకరించారు. అయితే దీనికి పూర్తిగా వేఋపాటు వాద ఉద్యమాలే కారణం కాదని, ఇతరత్రా అనేక హేతువులున్నాయని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+