రోజా తాజా కష్టాలు

రోజాకు తెలుగుదేశంలో ఆదరణ పోవడానికి ప్రధాన కారణం నన్నపనేని రాజకుమారి అని తెలుస్తోంది. రెడ్డి కులస్ధురాలైన రోజా కాంగ్రెస్ కోవర్టులా తెలుగుదేశంలో వ్యవహరిస్తోం
ఆడవారికి ఆడవారే శత్రువులు అన్న సామెతను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని, మహిళారాజ్యం నాయకురాలు శోభారాణి నిజం చేసి చూపారు. రోజాది ఐరన్ లెగ్ అని ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం రోజాకు బాధ కలిగించి ఉండవచ్చు. ఆనాడు ఆమె తెలుగుదేశంలో చేరిన వెంటనే చంద్రబాబు నాయుడు అలిపిరి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న వెంటనే వైఎస్ మరణించారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి గంగాభవాని, రాజకుమారి, శోభారాణి కారకులని రోజా భావిస్తున్నట్టు సమాచారం. మంచి భవిష్యత్తు ఉన్న యువ రాజకీయ నాయకురాలి ఆశలను ఇలా సీనియర్లు భగ్నం చేయడం తప్పే.ఈ దెబ్బతో రాజకీయాల మీద ఆసక్తి కోల్పోయిన రోజా సినిమాల మీద టీవీ కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications