చిరు పార్టీకి పవార్ ఆఫర్

కేంద్ర వ్యవసాయ మంత్రిగా, ఎన్‌సిపి అధినేతగా, యుపిఎ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న శరద్ పవార్ కేంద్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే ఈ నిర్ణయం తీసుకోవడం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తున్నది. కాంగ్రెస్‌ను దునుమాడుతున్న చిరంజీవికి మద్దతు ఇవ్వడం ద్వారా శరద్‌పవార్ ఆశిస్తున్నదేమిటో ఓ అంతుచిక్కని ప్రశ్న. రాజకీయ దురంధరుడిగా పేరున్న పవార్ కు ప్రధాన మంత్రి పదవిపై ఎప్పటినుంచో కన్ను ఉంది.
కాగా, అసలు ప్రజారాజ్యం పార్టీకి ఎన్‌సిపి ఎన్నికల గుర్తు ఇస్తే ఏం జరుగుతుంది? అసలు ఇలా ఒక పార్టీ వాళ్ళు మరో పార్టీకి ఎన్నికల గుర్తును అప్పుగా ఇస్తారా? లాంటి ప్రశ్నాస్త్రాలతో విపక్షాలు ఎదురుదాడికి సిద్ధమవుతోన్నాయి. ఏది ఏమైనా శరద్ పవార్ వ్యవహారశైలి రానున్న ఎన్నికల పొత్తులపై ప్రభావం చూపనున్న మాట మాత్రం సుస్పష్టం.












Click it and Unblock the Notifications