విజయశాంతి అలక?

సినిమాల్లో వేషాలు బాగా తగ్గిపోయిన తర్వాత విజయశాంతి అప్పటి అధికార బిజెపిలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పిన బిజెపి ఈ ప్రాంత ప్రజలను మోసగించిందని ఆరోపిస్తూ ఆమె రాజీనామా చేశారు. ఆ తర్వాత కొంత కాలానికీ తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు. సొంత నిధులతో ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళలేక కొంత కాలం మౌనంగా ఉండిపోయారు. ఇటీవలే ఆమె తన పార్టీని టీఅర్ ఎస్ లో విలీనం చేశారు. అయితే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం పోలేదన్నట్టు ఇప్పుడామె టీఆర్ ఎస్ లో పెద్ద నాయకురాలైనా అనుకూలమైన స్ధానం లభించడం లేదు. మెదక్ అయినా భువనగిరి అయినా తాను పెద్ద మెజారిటీతో నెగ్గగలనని ఆమె విశ్వాసం.
డజన్ల కొద్దీ సినిమాల్లో నటించినా విజయశాంతి ఆ డబ్బును సద్వినియోగం చేసుకున్నట్టు లేదు. బిజెపిలో చేరే వరకు ఆమెను ఆర్ధిక ఇబ్బందులు వెంటాడాయి. బిజెపి నాయకులు కొన్ని బ్యాంకుల ద్వారా ఆమెకు రుణాలు ఇప్పించి, ఒక సిక్ హోటల్ ను టేకోవర్ చేయించినట్టు సమాచారం. ఆ డీల్ లో విజయశాంతి విజయవంతంగా బయటపడినా తల్లి తెలంగాణ పార్టీ మీద ఆ డబ్బంతా ఖర్చు పెట్టినట్టు చెబుతున్నారు. విజయశాంతి జయలలితకు ప్రియ శిష్యురాలు. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు కొంత ఆదుకున్నా అది ఏమూలకూ రాలేదంట. చూడాలి, రాములమ్మ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో? అన్నె అనుకూలిస్తే అంటే లోక్ సభకు ఎన్నైకైతే, అక్కడ కాంగ్రెస్, బిజెపి లకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పడితే ఆమె కేంద్ర మంత్రి అయినా ఆశ్చర్యం లేదు. కానీ అన్నీ ఉల్టా తిరిగితే ఆమె మరో ఉపాధి మార్గం చూసుకోవలసిందే.












Click it and Unblock the Notifications