జగన్ తగ్గినట్టేనా?

రోశయ్య నిన్న సోనియా గాంధీ చేసిన ప్రశంసతో ముఖ్యమంత్రిగా మరింత బలపడ్డారు. మంత్రి వర్గ పూర్ వ్యవస్ధీకరణకు కూడా సోనియా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే రోశయ్య సిఎంగా పాతుకు పోయినట్టే. వైఎస్ జగన్ ను బహిరంగంగా సమర్ధించి, రోశయ్యను విమర్శించిన కొండా సురేఖ వంటి మంత్రుల గుండెల్లో నిన్నటి నుంచి రైళ్ళు పరుగెడుతున్నాయి. రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలన్న తన నిర్ణయాన్ని సోనియాగాంధీ ప్రధానికి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వీరప్ప మొయిలీకి తెలియజేసినట్టు సమాచారం. నిన్న కెవిపితో ప్రత్యేకంగా సమావేశమైన మొయిలీ అదే విషయాన్ని ఆయన చెవిలో వేసి తోందరపడవద్దని చెప్పినట్టు తెలుస్తోంది.
తండ్రి మరణానంతరం జగన్ వర్గం కొన్ని పొరపాట్లు చేసింది. జగన్ ఆ షాక్ నుంచి వెంటనే తేరుకుని కాంగ్రెస్ హైకమాండ్ తో మరీ ముఖ్యంగా సోనియాగాంధీతో తరచు కలుగజేసుకుని మాట్లాడుతూ, తన తండ్రి గారు మిగిల్చిపోయిన పనులను పూర్తి చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ అసెర్టివ్ గా మాట్లాడి ఉంటే సీన్ మరో విధంగా ఉండేది. కానీ ఆయన దిగులుగా తోటకూర కాడలా ఒరిగిపోవడం హైకమాండ్ కు రాంగ్ సిగ్నల్స్ ను పంపింది.
రోశయ్య, జగన్ ల మధ్య కాంగ్రెస్ పార్టీ చీలిపోతే, మధ్యంతర ఎన్నికలు ఖాయమని అందుకు సిద్ధపడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యనాయకులకు హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ చీలిపోకుండా కాంగ్రెస్ హై కమాండ్ అన్నిముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications