సినిమాల్లోనే ఖుషి?

అయితే పవన్ ప్రస్తుతం దృష్టి మొత్తం పులి చిత్రంపైనే పెట్టారని అది కొలిక్కి రాగానే తిరిగి పార్టీకి తన సేవలు అందిస్తానన్నారని చిరు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ మాత్రమే కాక అతని కోటరీ వ్యక్తులు సైతం అకేషనల్ గానే కనపడటాన్ని మాత్రం చాలా మంది తప్పుపడుతున్నారు. విజయం ఉన్నప్పుడు తోడు లేకున్నా ఫరావాలేదని, ఇలా పార్టీనీ పునర్నించాల్సిన సమయంలో మొహం చాటేయకూడదనేది వారి వాదన.అంతేగాక పార్టీ ఓడిపోవటంలోనూ అతని భాగస్వామ్యం ఉందని అది సమీక్షించుకుంటేనే మనుగడ ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ నాగబాబు గూర్చి ఎక్కడా ప్రస్ధావన రాకపోవటం గమనార్హం.
శ్రీజ ప్రేమ పెళ్ళి చేసుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ లో తన పర్సనల్ రివాల్వర్ ను స్వాధీనం చేసి పవన్ అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత అతను దానిని తెచ్చుకున్నట్టు కన్పించదు. ఆ సమయంలోనే సామాన్యుల రక్షణ కోసం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను స్ధాపించినట్టు నటించి, దానికి కోటి రూపాయల విరాళాన్ని తన కష్టార్జితం నుంచి ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ సంస్త లేదు. ఆ కోటి రూపాయలు అక్కడికి వెళ్ళలేదు.
పవన్ కల్యాణ్ ది చాలా సెన్సిటివ్ మనస్తత్వం. ఈ సమాజంలో సామాన్యులు బాధ పడకూడదని ఆయన అభిమతం. కానీ ప్రజారాజ్యం కుటుంబరాజ్యంగా మారిందన్న విమర్శలు వచ్చాయి.












Click it and Unblock the Notifications