చిరంజీవికి ఎందుకంత...

ఇప్పుడు చిరంజీవి సినిమాల్లో నటించాలని జోగయ్య కోరుకోవడం ఆయన కపటానికి నిదర్శనమని, రాజకీయ పరిపక్వత వచ్చే వరకు సినిమాల్లో కొనసాగమని పరోక్షంగా సంకేతమిచ్చారని వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి.తన తండ్రికి మిత్రుడైన జోగయ్య అంటే చిరంజీవికి అపార గౌరవమున్నా ఆయన వ్యాఖ్యలు ఇబ్బందుల్లో పడేస్తున్నాయి.
చిరంజీవికి మళ్ళీ సినిమా రంగంలోకి వెళ్ళి డబ్బు సంపాదించాల్సిన అగత్యం లేదు. ఇద్దరు ఆడ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొడుకు సినిమాల్లో హీరోగా స్ధిరపడిపోయాడు. ఇప్పుడాయన పూర్తి కాలం రాజకీయాలకు కేటాయించి వచ్చే ఎన్నికల్లో అయినా సంచలనాత్మకంగా ముఖ్యమంత్రి కావచ్చు.
చిరంజీవి ప్రజారాజ్యం ఫ్లాప్ షోను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్ల ఆయన మాటల్లో స్పష్టత లోపించింది. అభిప్రాయాల్లో పొంతన లేకుండా పోతోంది. ఇప్పుడు ఆయనకు సలహాదారులు ఎవరూ లేరు. ఆయనంతట ఆయన ఒక అభిప్రాయానికి వచ్చి మీడియాతో మాట్లాడవలసి వస్తోంది.
కొసమెరుపు: చిరంజీవి అపారంగా గౌరవించే మరో వృద్ధ నాయకుడు ఉన్నారు. ఆయన ఎం సత్యనారాయణ రావు. ఒక సందర్భంలో ఎక్కడో కలిసినప్పుడు ఎమ్మెస్ "చిరంజీవీ! నువ్వు ముఖ్యమంత్రివి అవుతావు" అని అన్నారట. ఎన్నికల తర్వాత సీన్ వేరుగా ఉన్నా ఇప్పటికీ చిరంజీవి ఎం సత్యనారాయణకు ఫోన్ చేసి ఆశీస్సులు అడుగుతుంటారట.












Click it and Unblock the Notifications