జగన్ ప్లస్, మైనస్ లు

జగన్ మొదటి నుంచి అదృష్ట జాతకుడే అని చెప్పాలి. పెద్దగా చదువు అబ్బలేదు. తండ్రి రాజకీయాల్లో అప్పటికి చాలా సొమ్ము పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో బెంగుళూరులో చిన్నా చితకా వ్యాపారాలు చేసుకుంటున్న జగన్ సడన్ గా తెరమీదికి వచ్చారు. ఎలా? తండ్రి 2004 లో పాదయాత్ర చేసి,కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడు అనిపించుకుని ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి కావడం వల్ల. అప్పటి నుంచి జగన్ కు ఆడింది ఆట పాడింది పాట అయింది. ఒక రకంగా జగన్ ఎంతో అదృష్టవంతుడు. తాను ఎదిగి వచ్చే సమయానికి తండ్రి ముఖ్యమంత్రి కావడం అందుకు ఉదాహరణ. ఆ లెక్కన వేసుకుంటే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి కావడం జాతకరీత్యా చాలా సులభం.
అయితే జగన్ లో ఎంత దుందుడుకు స్వభావం ఉందో అంత సాత్వికత,వివేచన కూడా ఉంది.ముఖ్యమంత్రిగా పనిచేయడానికి నాలుగైదు సార్లూ ఎన్నిక కావాలన్న రూలు ఏమీ లేదు. వారసత్వ రాజకీయాల గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎన్నయినా వ్యతిరేకంగా చెప్పవచ్చు. కానీ భారత రాజకీయాల్లో అన్ని పార్టీల్లో ఈ వారసత్వ ఫ్యాక్టర్ ఉంది. మెజారిటీ ప్రజా ప్రతినిధులు ఎటువైపు ఉంటారన్నదే ప్రధానాంశం. ప్రస్తుతానికి మెజారిటీ జగన్ పక్షాన ఉంది.
వైఎస్ వంటి ఒకే ఒక్కడు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో సమైక్యంగా ఉంచగలిగారు. గతంలో అది ఎవరికీ సాధ్యం కాలేదు. భవిష్యత్తులో కూడా అది సాధ్యమవుతుందని భావించలేం. జగన్ అభ్యర్ధిత్వాన్ని లోలోన వ్యతిరేకించేవారు క్రమంగా పెర్రుగుతున్నారు. వచ్చే వారం అధిష్టానవర్గం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్ద్దాం.












Click it and Unblock the Notifications