ఏన్నో అంశాలు: చంద్రబాబు గేమ్ ప్లాన్ పారదేమో!

ఇప్పుడు బాబ్లి విషయం వదిలేద్దాం. ఎన్టీఆర్ కారణంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గట్టి బీజాలు ఏర్పడాయి. పటేల్, పట్వారీ వ్యవస్ధను రద్దు చేయడం, బీసీలను ప్రోత్సహించడం వల్ల టిడిపికి అంత బలం ఇక్కడ చేకూరింది. అయితే చంద్రబాబు నాయుడు కొంతకాలం సమైక్యాంధ్ర అనడం, ఆ తర్వాత రెండు ప్రాంతాలూ రెండు కళ్ళు అనడం ఇక్కడ చాలా అనుమానాలకు దారి తీసింది. చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ ఈ ఊగిసలాట ధోరణిలో ఎక్కడికో వెళ్ళి పోయింది.
ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పెద్దగా ఆశించేది ఏమీ ఉండకూడదు. దానికి కారణం చంద్రబాబు నాయుడు ఊగిసలాట ధోరణే. ఇప్పుడు బాబ్లి ఉదంతాన్ని జనం పెద్దగా పట్టించుకోకుండా ఉంటే మంచిది. సొంత తమ్ముడిని చాలా కాలం దూరం పెట్టి చంద్రబాబు నాయుడు జనానికి దూరమయ్యారు. మన సమాజంలో సెంటిమెంట్లు చాలా ఎక్కువ. తమ్ముడిని దూరంగా పెట్టాడంటే జనం ఆ నాయకుడిని నమ్మరు. మరికొన్ని విశేషాలు వచ్చే సంచికలో.....












Click it and Unblock the Notifications