వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విధిలేని పరిస్ధితుల్లో కాంగ్రెసు వైపు మొగ్గుచూపుతున్న చిరు!

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: చిరంజీవికీ కాంగ్రెసు కు మధ్య సంబంధం నిరూపణ అయింది. జగన్ వల్ల రోశయ్యకు మెజారిటీ తగ్గి ప్రభుత్వం పడిపోయే పరిస్ధితి వస్తే తనతో సహా తన ఎమ్మెల్యేల మద్దతు ఇస్తానని ఆయన స్పస్టంగా ప్రకటించడం అందుకే. స్వతహాగా సౌమ్యుడైన చిరంజీవి నిన్న జగన్ మీద పరోక్షంగా రెచ్చిపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కాంగ్రెసు అధిష్టానవర్గం జగన్ కు వ్యతిరేకంగా చిరంజీవిని ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఈ పోర్టల్ మీరు చదివే ఉంటారు.

ముసలి రోశయ్యపై జగన్ కు గౌరవం లేదు. చిరంజీవికి అభిమానం లేదు. అందుకు వారి కారణాలు వారికున్నాయి. వైఎస్ లేకపోవడం వల్ల చాలా మంది చాలా దారుల్లో పయనిస్తున్నారు. కాంగ్రెసు హై కమాండ్ మీద ఒత్తిడి తేవడానికి జగన్ ఇప్పటికీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే అయిన తన తల్లి విజయలక్ష్మితో రాజీనామా చేయించడానికి కూడా ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు.

మళ్ళీ మొదటి విషయానికి వస్తే చిరంజీవి ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెసులో కలిసిపోడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కనీసం మూడో వంతు మంది ఫిరాయిస్తే తప్ప చర్యలు ఉండవు. చిరంజీవి తప్ప మొత్తంగా కట్టగట్టుకుని ఫిరాయించడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. చిరంజీవి తన ఫేస్ సేవింగ్ కోసం కాంగ్రెసు హైకమాండ్ తో టచ్ లో ఉండి తన ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్నారు. వచ్చే కొన్ని రోజుల్లో చాలా ఆసక్తికరమైన పరిణామాలు ఉంటాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X