పవన్ కల్యాణ్ ఇంకా ప్రజారాజ్యంలో కొనసాగుతున్నారా?

తన తమ్ముళ్ళు పవన్ కల్యాణ్, నాగబాబు తనతో కలిసి రావడం లేదన్న విమర్శలను నేటి మీడియా సమావేశంలో చిరంజీవి కొట్టిపారేశారు. నిజం ఏమిటంటే ప్రజారాజ్యం రాజకీయాలతో పవన్ కల్యాణ్, నాగబాబు విసిగిపోయారు. వీరిద్దరూ ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు. ప్రజారాజ్యం అల్లు అరవింద్ ఆధ్వర్యంలో వింత పోకడలు పోవడం వారికి సహించడం లేదు. అన్న చిరంజీవి మీద అపార గౌరవమున్నా ప్రజారాజ్యం పార్టీలో జరిగిన విషయాలు వారికి రుచించలేదు.
చాలా ఆలస్యమైనా పవన్ కల్యాణ్ కొమురం పులి తెలుగు సినిమా పరిశ్రమలో టాపెస్ట్ హిట్ అవుతుందన్న అంచనాలున్నాయి. పవన్ కల్యాణ్ డబ్బు మనిషి కాదన్న విషయం చాలా మందికి తెలుసు. హీరో వెంకటేష్ లాగానే ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. ఈ సినిమా తర్వాత ఆయన నాగార్జూన లాగా ఒక మంచి భక్తి చిత్రంలో నటిస్తే ఆయన కెరీర్ లో ఒక మంచి అధ్యాయం మొదలవుతుంది.












Click it and Unblock the Notifications