చంద్రబాబుకు చీలిక ముప్పు?

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ కొద్ది కాలంలో నిట్టనిలువునా చీలిపోతుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పార్టీని చీల్చేందుకు ఓ కేంద్ర మంత్రికి చెందిన నమ్మకమైన వ్యక్తి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాదులోని జూబిలీహిల్స్ కేంద్రంగా తెలుగుదేశం పార్టీని చీల్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో విసిగిపోయిన నాయకులను బయటకు తెచ్చి ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేయించాలనే ప్రధానోద్దేశంతో పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 90 మంది శాసనసభ్యులున్నారు. వారిలో కనీసం 30 మందిని చీల్చే కుట్ర సాగుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో విసిగిపోయినవారిని అందుకు ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వైయస్ జగన్ పార్టీ నుంచి విడిపోయి ప్రత్యేకంగా కొత్త పార్టీ పెడతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే కాకుండా తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి కాంగ్రెసు నాయకత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం శాసనసభ్యులకు ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయల దాకా కాంగ్రెసు ఇవ్వజూపుతుందని బహిరంగంగానే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం నాయకులే ఆ ప్రకటన చేశారు. తమ పార్టీ శాసనసభ్యులను ప్రలోభ పెట్టేందుకు కాంగ్రెసు ప్రయత్నిస్తోందని వారు విమర్శించారు.

కేంద్ర మంత్రి బంధువు ఒకరు ప్రతి రోజూ తమ పార్టీ శాసనసభ్యులకు ఫోన్లు చేస్తూ బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టాలని సూచిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ 30 మంది ఎవరనేది స్పష్టంగానే తెలిసిపోతోంది. తెలంగాణకు చెందిన శాసనసభ్యులకు ఆ వ్యక్తి ఫోన్ చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బయటకు వచ్చినప్పుడు ఏ విధమైన విమర్శలు రావని కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ పార్టీ ఫిరాయింపుల నిరోధం కింద అనర్హత వేటు పడినా నష్టం లేదని, తెలంగాణ కోసం బయటకు వచ్చినందున ప్రజలే తిరిగి గెలిపించుకుంటారని వివరిస్తున్నారని సమాచారం. ఎన్నికల ఖర్చు కూడా తామే పెట్టుకుంటామని కేంద్ర మంత్రి బంధువు చెబుతున్నారని సమాచారం.

అయితే, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లి కొత్త పార్టీ పెట్టినవారెవరూ ఫలితం సాధించలేదని తెలుగుదేశం వర్గాలు దీమాతో ఉన్నాయి. వసంత నాగేశ్వర రావు, కె. జానారెడ్డి, పి. ఇంద్రారెడ్డి, దేవేందర్ గౌడ్ పార్టీ నుంచి విడిపోయి కొత్త పార్టీలు పెట్టారని, అలా పెట్టి తేలిపోయారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+