తెలుగులోకి డబ్బింగ్ జోరు

Chandramukhi
మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. ఈ విషయాన్ని తరుచుగా తమిళ, కన్నడ, హిందీ చిత్ర కథానాయకులు, దర్శకులు చెబుతుంటారు. అది నిజమేనని నిరూపించడానికి మొన్నబొంబాయి, జీన్స్, నిన్న చంద్రముఖి, అపరిచితుడు, నేడు యముడు, ఆవారా చిత్రాలు మంచి ఉదాహరణలు. సినిమాలకి ట్రెండ్ ఉంటుంది. ఓసారి ఫ్యామిలి, మరోసారి లవ్, ఇంకోసారి ఫ్యాక్షన్, కామెడీ... మళ్లీ ఫ్యామిలీ ఉంటోంది. కానీ ట్రెండ్ కు అతీతంగా కథనం ఉంటే చాలు డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ చిత్రాలకు ధీటుగా డబ్బింగ్ చిత్రాలు వసూళ్లు చేసిన సందర్భాలు కోకొల్లలు.

రజనీకాంత్, కమలహాసన్, విక్రమ్, సూర్య, సురేష్ గోపి, మమ్ముట్టి వంటి వారు వారివారి భాషల్లోనే కాకుండా తెలుగులోనూ టాప్ హీరోల స్థాయికి ఎదిగారు. ఇక దర్శకులలో ఏ.ఎం.రత్నం, శంకర్ గూర్చి చెప్పవలసిన పని లేదు. రజనీ వంటి పరభాషా హీరోల చిత్రాలైతే విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఆవి డబ్బింగ్ చిత్రాల స్థాయిలో కాకుండా స్రెయిట్ చిత్రాల మాదిరిగా నడుస్తూ ఇక్కడి చిన్న చిత్రాల విడుదలకు అడ్డంకిగా నిలుస్తుండటంతోపాటు, పెద్ద హీరోల చిత్రాల కలెక్షన్లను దెబ్బతీస్తున్నాయంటే డబ్బింగ్ చిత్రాల జోరు ఎలా ఉందో తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పరభాషా నటులకు, దర్శకులకు మార్కెట్ తొంభయ్యో దశకానికి కాస్త అటుఇటుగా ప్రారంభమైందనుకోవచ్చు.

తాజాగా రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న రోబోకు ఇప్పటికే ఇక్కడ ఏర్పడ్డ క్రేజ్ అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా వస్తోన్న కొమరం పులికి ఏమాత్రం తీసిపోని విధంగా రోబోకు క్రేజ్ ఏర్పడింది. గత వేసవి నుండి ఇప్పటి వరకు ఒకటి రెండు మినహా తెలుగులో మంచి స్రెయిట్ చిత్రాలు రాలేదు. దీంతో ప్రేక్షకులు రజనీ రోబో, పవన్ కొమరం పులి చిత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాల కారణంగా కొన్ని చిత్రాలు వాయిదా పడ్డాయి. వీటితో పాటు షాపింగ్ మాల్ అనే అనువాద చిత్రం సైతం విడుదల కానుంది. దీన్ని సురేష్ కొండేటి నిర్మిస్తున్నారు. ఈ మధ్య వచ్చిన చిత్రాలలో స్రెయిట్ అయితే రవితేజ నటించిన డాన్ శీను, సునీల్ హీరోగా వచ్చిన మర్యాద రామన్న డబ్బింగ్ అయితే సూర్య హీరోగా నటించిన యముడు, కార్తి నటించిన ఆవారా చిత్రాలు భారీగా కలెక్షన్లు రాబట్టాయి. ఇవి తప్ప మరేవి మంచి చిత్రాలు రాకపోవడంవల్ల థియేటర్ల నిర్వహణ కష్ట సాధ్యమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో కొన్ని ప్రాంతాలలో అనివార్యంగా అనువాద చిత్రాలు ప్రదర్శించవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు మూడేళ్ల కిందటి చిత్రాలను సైతం అనువాదం చేస్తున్నారు. ఈ కారణంగా మనకు ఏ మాత్రం పరిచయం లేని నటీనటుల చిత్రాలు సైతం విడుదలవుతున్నాయి. శృంగార భరిత చిత్రాలకు ఏమాత్రం కొదువలేదు. అయితే కథనం లోపించిన చిత్రాలను మాత్రం ప్రేక్షకులు నిర్మోహమాటంగా తిరస్కరిస్తున్నారు. పొరుగింటి పుల్లకూర రుచి అనే బదులు మనలో ఏం లోటుపాటులు ఉన్నాయో తెలుగు పరిశ్కమ తెలుసుకోవాలి. తెలుగైనా, డబ్బింగ్ ఐనా మంచి కథనం ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. దీనికి ఈ మధ్య విడుదలైన మర్యాద రామన్న మంచి ఉదాహరణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+