జగన్ కు కిరణ్ సాటి వస్తారా?

వైయస్ జగన్, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా రాయలసీమకు చెందినవారే. అయితే, ఆర్థిక, అంగబలాలు జగన్ కు ఉన్నంతగా కిరణ్ కుమార్ రెడ్డికి లేవు. ఆ తెగువ కూడా కిరణ్ కుమార్ రెడ్డిలో కనిపించదు. అయితే, వ్యూహంలో మాత్రం వైయస్ జగన్ కన్నా కిరణ్ కుమార్ రెడ్డిది పైచేయి కావచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి అన్ని వైపులా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారనే అభిప్రాయం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఏ మేరకు వైయస్సార్ లాగా సొంత బలగం ఏర్పడుతుందో చెప్పలేని పరిస్థితి. పైగా, పదవులు దక్కనివారు చాలా మంది ఆయనకు సహకరించే అవకాశం లేదు. నిర్ణయాల్లో స్వేచ్ఛ కూడా ఉండదు.
కాగా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగం ఆవేశపూరితంగా ఉండదనేది కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. ఆయన తడుముకోకుండా మాట్లాడలేరు. అది ఆయనకు అడ్డంకిగానే మారుతుంది. పైగా, ఆయన నవ్వు వంకరగా ఉంటుంది. ఇది ఇతరులను కించపరచే విధంగానే కాకుండా ఆయన వ్యక్తిత్వం సజావుగా ఉంటుందా అనే అనుమానాలకు కూడా తావిస్తుంది. వైయస్ జగన్ నవ్విన సందర్భాలు బహుశా ఇటీవలి కాలంలో లేకపోవచ్చు. యాంగ్రీ యంగ్ మెన్ గానే కనిపించాలని ఆయన అనుకుంటున్నట్లున్నారు. లోపల మండిపోతున్నట్లుగా ఉంటారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడేవారు, ఆయన లబ్ధి పొందినవారు ఆయన నమ్మినబంట్లుగా ఉండే అవకాశం ఉంది. ఈ తేడాల్లో వైయస్ జగన్ పై కిరణ్ కుమార్ రెడ్డి పైచేయి సాధిస్తారా అనేది చెప్పలేం.












Click it and Unblock the Notifications