మందకృష్ణ మాదిగ తెరాస అధినేత కెసిఆర్ కు దగ్గరవుతున్నాడా

Mandakrishna Madhiga
మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్ర సమితి కె.చంద్రశేఖరరావుకు దగ్గరవుతున్నాడా. గత కొంతకాలంగా కెసిఆర్ ఊసెత్తని మందకృష్ణ మంగళవారం రాత్రి తెలంగాణ భవన్‌లో కెసిఆర్ తో భేటీ అయ్యారు. గత సంవత్సరం కె.చంద్రశేఖరరావు నిరాహార దీక్షకు పూనుకున్నప్పుడు మందకృష్ణ మద్దతు పలికాడు. ఆ తర్వాత కేంద్రం రాష్ట్రాన్ని ప్రకటించి వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో కెసిఆర్ తో మందకృష్ణ విభేదించాడు. వరంగల్ లోని సభలో మందకృష్ణ కెసిఆర్ దొరతనాన్ని ప్రశ్నించారు. ఉద్యమంలో కెసిఆర్ తమను తక్కువ చేసి చూపిస్తున్నాడంటూ విద్యార్థులను రెండువర్గాలుగా చీల్చాడు. అప్పటినుండి మందకృష్ణ కెసిఆర్ కు దూరంగా ఉన్నాడు.అనంతరం కొన్ని పరిణామాలతో క్రమంగా తెలంగాణ ఐకాసకు కూడా దూరమయ్యారు.

ఇటీవల ప్రజా గాయకుడు గద్దర్ పెట్టిన ప్రజా ఫ్రంట్ ను కూడా సమర్థించాడు. గద్దర్ కూడా ఉద్యమాన్ని నీరుగార్చడానికే ఫ్రంట్ ను నెలకొల్పినట్టు పలువురు భావిస్తున్నారు. కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉధ్యమం భారీ స్థాయిలో ఉవ్వెత్తున ఎగుస్తున్నప్పుడు ఫ్రంట్ పెట్టాల్సిన అవసరం ఏమిటని పలువురు ప్రశ్నించారు. ఆ ఫ్రంట్ ను సమర్థించిన మందకృష్ణ ఫ్రంట్ తో కలిసి ఎన్నికలలోకి వెళ్లాలనుకున్నాడు. కాని ఫ్రంట్ ఎన్నికలకు దూరం అని ప్రకటించారు. అయితే మందకృష్ణ అనుకోనివిధంగా మంగళవారం కెసిఆర్ తో భేటీ కావటం, డిసెంబర్ 4న నిర్వహించే మాదిగల యుద్ధభేరీకి కెసిఆర్ ను ఆహ్వనించడం వెనుక తెరాసకు దగ్గరవ్వాలనే ఆయన ఆలోచనను తెలియజేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+