వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుదేశంపై వ్యతిరేకతతోనే 'అదుర్స్' కు వ్యతిరేకత

By Santaram
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం చివరికి తెలుగుదేశం మీదికి ముఖ్యంగా కమ్మ వ్యాపారుల మీదికి గురి పెట్టినట్టైంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షురాలు కవిత నేడు పెట్టిన మీడియా సమావేశంలోని సారాంశమిదే. "అదుర్స్"సినిమా నిర్మాతలు కొడాలి నాని తదితరులు తెలుగుదేశం నాయకులు, మరీ ముఖ్యంగా సమైక్య వాదులు. ఇక్కడ కవిత చాలా తెలివిగా మాట్లాడి మీడీయా నుంచి ఎక్కువ ప్రశ్నలు రాకుండా జాగ్రత్త పడి మధ్యలోనే మీడియా సమావేశాన్ని ముగించారు.

సంక్రాంతికే విడుదల కానున్న వెంకటేష్ సినిమా "నమో వెంకటేశ"ను తాము వ్యతిరేకించడం లేదని ఆమె చెప్పడం విశేషం. ఆంధ్ర సినిమాల హీరోల అందరిమీదా ఒకేసారి పడకుండా టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ప్రచారం చేసి సమైక్యాంధ్ర నినాదాన్ని విన్పించినవాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత తెలుగుదేశం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయడం, మళ్ళీ ప్లేటు మార్చడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన ప్రతిబంధకం తెలుగుదేశమే అయింది. అందువల్లనే "అదుర్స్" సినిమాకు ఈ ట్విస్టులు వచ్చాయి.

పొట్టకూటి కోసం వచ్చిన వారి మీద కాదు మా పోరాటం, పొట్టలు కొట్టేవారి మీదే అన్నది మొదటి నుంచి కెసిఆర్ నినాదం. అయితే పొట్టలు కొడుతున్నవారెవరో ఒక జాబితా తయారు చేసుకోవాలి కదా? తెలంగాణ వాదులకు ఒక రామోజీరావు, ఒక లగడపాటి, ఒక మురళీమోహన్ మాత్రమే కన్పిస్తున్నారు. ఇంకా పుట్టలో పాముల్లా ఎందరో ఆంధ్రా వాలాలు ఇక్కడ కోట్లాది రూపాయల వ్యాపారాలు చేస్తున్నారు. అటువంటివారిపై స్పష్టమైన వైఖరి కన్పించడం లేదు.

"అదుర్స్" సినిమా ప్రదర్శనను అడ్డుకోవద్దని హైకోర్టు మంగళవారం సాయంత్రం ఆదేశించడం మరో విశేషం. సినిమా ప్రదర్శనను అడ్డుకునేవారిపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు పోలీసులను ఆదేశించారు. దీనితో తెలంగాణ ప్రాంత ఎగ్జిబిటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా "మగధీర" కంటే అద్భుతంగా ఉందన్న ఊహాగానాలు రావడంతో తెలంగాణ బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు ఈ సినిమాతో కొంత లాభపడవచ్చన్న ఆశలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X