తాత వేషాల్లో జూ ఎన్టీఆర్

రామానాయుడు రీమేక్ రాముడు - భీముడు చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుంటున్నారు. పాత రాముడు - భీముడులోని పాటలన్నీ రీమిక్స్ చేస్తారు. ఎన్టీఆర్ ముఖకవళికలను, వాచకాన్ని పూర్తిగా పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ ఎన్టీఆర్ సరిగ్గా సరిపోలుతారని రామానాయుడు భావిస్తున్నారట. అన్నీ సజావుగా సాగితే వచ్చే విజయదశమికి సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.
సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. బృందావనం సినిమాలో కాజల్ వ్యవహారశైలిని, నటనను చూసిన ఎన్టీఆర్ ఆమె పట్ల మోజు పడుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications