రాహుల్ తో ఆకుల విక్రం లింక్?

Rahul Gandhi
రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ ఆగడాలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. మైక్రో ఫైనాన్స్ చెరలో చిక్కుకుని రోజుకొకరు, ఇద్దరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ఆ సంస్థలను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఓ ఆర్డినెన్స్ ను కూడా జారీ చేసింది. ఈ సమయంలోనే మరో విషయం కూడా ప్రధానమైన చర్చగా ముందుకు వచ్చింది. కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ మైక్రో ఫైనాన్స్ సంస్థలను ప్రోత్సహించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో సహా ప్రతిపక్షాల నాయకులందరూ విమర్శలు కురిపిస్తున్నారు. ఎస్కెఎస్ మైక్రో ఫైనాన్స్ సిఇవో విక్రం ఆకులతో రాహుల్ గాంధీకి సన్నిహిత సంబంధాలున్నాయనే ఆరోపణలు వచ్చాయి. అయితే, రాహుల్ తో తనకు ఏ విధమైన సంబంధాలు లేవని విక్రం ఆకుల స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణల్లో కేంద్ర బిందువు విక్రం ఆకుల. తెలుగు ఎన్నారై అయిన విక్రం ఆకుల - ఈ వ్యవహారంతో రాహుల్ కు ఏ విధమైన సంబంధం లేదని కొట్టి పారేశారు. కొన్ని టీవీ చానెళ్లతో ఆయన శుక్రవారం అదే పనిగా మాట్లాడారు.

2004లో విక్రం ఆకుల వ్యాపారంలో దెబ్బ తిని తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారు. అదే సమయంలో భార్య విడాకులు తీసుకుంది. ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వచ్చిందనేది సమాచారం. ఆ సమయంలోనే పేదలను, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా ఎంచుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఏర్పాటు చేయాలనే ఆలోచన విక్రం ఆకులకు వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఎస్కెఎస్ మైక్రో ఫైనాన్స్ ను స్థాపించారు. మావోయిస్టుల హెచ్చరికలను కూడా బేఖాతరు చేస్తూ సంస్థను నడిపించాడు. ఈ క్రమంలో తాను పేదలకు సాయం చేస్తున్నానని చెప్పుకుని విక్రం ఆకుల రాహుల్ గాంధీతో సంబంధాలను ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీ మైక్రో ఫైనాన్స్ సంస్థలపై అధ్యయనం మాత్రమే చేశారని, వాటితో రాహుల్ కు సంబంధం లేదని కాంగ్రెసు నాయకులు, మంత్రులు చెబుతూ వస్తున్నారు. రాహుల్ కు సంబంధం ఉందని వచ్చిన విమర్శలపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ భగ్గుమన్నారు. వ్యవహారంలోకి రాహుల్ గాంధీని లాగడంతో రోశయ్య ప్రభుత్వం హుటాహుటిగా కదిలి ఆర్డినెన్స్ ను జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ జారీతో ఆకుల విక్రం ఎస్కెఎస్ షేర్ వాల్యూ 9 శాతనికి పడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+