సిడిలుగా నిత్యానం సెక్స్ వీడియోలు?

Nityananda Swami
హైదరాబాద్: సినీనటి రంజితతో రాసలీలలు జరుపుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నిత్యానంద స్వామి కోసం ప్రత్యేక పోలీసు దళాలు వివిధ రాష్ట్రాల్లో అన్వేషిస్తున్నాయి. ఇప్పటికే వెలుగులోనికి వచ్చిన తమిళ హీరోయిన్ రంజిత నేను కాదు బాబోయ్ అంటూ మెరపెట్టుకుంటున్నా కొన్ని సాక్ష్యాలు మాత్రం క్లియర్ గా ఆమే అనే విధంగా చెప్తున్నాయి. రంజిత అక్కాచెల్లెళ్లైన అంబిక, రాధ ఈ ఆనందుని వ్యవహారాలకు ముఖ్య ఇన్ చార్జ్ గా వ్యవహారిస్తున్నారని పోలీసుల విచారణలో బయట పడింది. రంజిత అక్కాచెల్లెళ్ల లో తమిళనాడు వ్యవహారాలను మొత్తం అంబిక చూసుకుంటుండగా కేరళలో స్వామి కార్యాలన్నీ రాధ చూసుకుంటుందని విచారణలో తేలింది.

అంతే కాదు వీరిద్దరు నూతన నటీమణులను స్వామికి ఆహారంగా అందించే విషయంలో కీలకపాత్ర పోషిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్ని అనుమానాల మధ్య ఆ వీడియోలో ఉన్నది నేను కాదు బాబోయ్ నన్ను వదలండి అంటూ రంజిత వ్యాఖ్యలు చేసినంత మాత్రాన విషయం బయటపడకుండా ఉండదు కదా! అంటున్నారు విమర్శకులు.

మొన్నటి శృంగాల లీలల ప్రసారాల్లో కనిపించిన నటి రంజితతో పాటు ఎనిమిదవ దశకంలో చిత్ర పరిశ్రమను ఏలిన ఇద్దరు తారలతో కూడా నిత్యానంద సాన్నిహిత్యాన్ని లెనిన్‌ చిత్రీకరించినట్లు ప్రచారం జరిగింది. ప్రచార మాధ్యమాలకు ఇచ్చేందుకు మునుపే నిత్యానంద రాసలీలలను సీడీలుగా చేసి లెనిన్‌ బయట విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ తారలతో నిత్యానంద చేసిన రాసలీలల ఎడిట్‌ చేయని చిత్రీకరణల సీడీలను పూర్తిస్థాయిలో విక్రయిస్తున్నట్లు ప్రచారం జరిగింది. బెంగళూరు, చెన్నై, ముంబయి, ఢిల్లీలో ఈ సీడీలు అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.

నిత్యానంద రాసలీలలను తానే చిత్రీకరించానని చెన్నై పోలీసుల ముందు లొంగిపోయిన స్వామి కారుడ్రైవరు లెనిన్‌ కురుప్పన్‌ ఇప్పుడు బెంగళూరు పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు సమాచారం. స్వామి కామలీలల్ని బెంగళూరు బిడది ధ్యానపీఠంలోనే చిత్రీకరించినట్లు అతను వెల్లడించిన సంగతి తెలిసిందే.

చెన్నై పోలీసులు లెనిన్‌ను ఆదివారం మధ్యాహ్నమే విమానంలో నగరానికి తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారని వార్తలు వచ్చాయి. అతని వివరాలను వెల్లడించేందుకు ఇక్కడి పోలీసులు నిరాకరించారు. లెనిన్‌ను రహస్య ప్రదేశంలో ఉంచి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+