రాజకీయాల్లోకి పోతుల సురేష్

పోతుల సురేష్ తో రాజీ కుదుర్చుకోవడానికి అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ప్రయత్నించారని ఊహాగానాలు చెలరేగాయి. అయితే, అందుకు సురేష్ అంగీకరించలేదని అంటున్నారు. ఈ స్థితిలోనే పోతుల సురేష్ అరెస్టు జరిగిందనే మాట కూడా వినిపిస్తోంది. తెలుగుదేశం తనకు ధర్మవరం టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెసు నుంచైనా పోటీ చేయడానికి పోతుల సురేష్ సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.
పరిటాల రవి హత్య తర్వాత ఆయన భార్య పరిటాల సునీత తమను పట్టించుకోలేదని పోతుల సురేష్, ఆయన భార్య పోతుల సునీత బాధ పడుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం తరఫున రాజకీయాలకు అవకాశం ఇస్తారా, లేదా అనే విషయంపై తేల్చుకోవడానికి పోతుల సునీత చంద్రబాబును కలిసినట్లు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రతిస్పందనను బట్టి ఏం చేయాలనే విషయంపై పోతుల సురేష్ దంపతులు నిర్ణయించుకుంటారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications