హీరోలపై వర్మ సెటైర్లు

Appalraju
తన చిత్రాలతో నిత్యం వివాదాల సుడిగుండంలో ఇరుక్కుపోయే రాంగోపాల్ వర్మ త్వరలో విడుదలయ్యే కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం-ఆప్పల్రాజు చిత్రంలో తెలుగు చిత్ర దర్శకులు, కథానాయకులను లక్ష్యంగా చేసుకున్నారు. పరిశ్రమలో ఉన్న టాప్ హీరోలు, టాప్ దర్శకులను తన చిత్రంలో దుయ్యబట్టారు. బ్రహ్మానందం ప్రముఖ పాత్రలో వస్తున్న ఈ చిత్రంలో రాంగోపాల్ వర్మ చిరంజీవి, బాలకృష్ణ, దర్శకరత్న దాసరి నారాయణరావు వంటి వారిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. రాంగోపాల్ వర్మ ఈ చిత్రంలోని పాటలను కూడా ఒక్కోటిగా విడుదల చేస్తున్నారు. ఇది అందరినీ ఆకర్షిస్తుంది. అయితే రాంగోపాల్ వర్మ తమను విమర్శిస్తూ రాసిన ఈ పాటపై పరిశ్రమలోని వారు ఎవరూ ఇప్పటి వరకు స్పందించడం లేదు.

వర్మ ఓ పిచ్చివాడని, మానసిక పరిస్థితి బాగాలేకే నిత్యం వివాదాస్పద చిత్రాలు తీస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ కూడా ఓ పిచ్చివాడు తీసిన పాటగానే భావించి ఊరుకుంటున్నట్టున్నారు. రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది వివాదమే అయి కూర్చుంటుంది. రక్త చరిత్ర చిత్రంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. ఎన్టీఆర్ పాత్రను సరిగా చూపించలేదని తెలుగుదేశం వారు, వైఎస్ పాత్రను చెడుగా చూపించారని కాంగ్రెస్ వారు, కక్ష్యలకు, కారుణ్యాలకు నిలయమైన అనంతపురం పేరుకు శ్రీకాకుళంలోని ఓ గ్రామం పేరును తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత బెజవాడ రౌడీలు తీస్తానని ప్రకటించి మరో సంచలనం సృష్టించాడు. ఆ ప్రకటనపై బెజవాడ రాజకీయ నాయకులు వర్మపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. అయినప్పటికీ ఆయన తగ్గలేదు. అయితే ఇంతకుముందు వివాదాలు వేరు, ఇప్పుటి వివాదాలు వేరు. తాను ఏ పరిశ్రమలో ఉన్నాడో అదే పరిశ్రమలోని వారినే ఆయన టార్గెట్ చేసుకోవడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+