వర్మ టాలీవుడ్ రీఎంట్రీ సీక్రెట్

Ramgopal Verma
హిందీ సినిమా రంగంలో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ రీఎంట్రీలోని రహస్యమేమిటనే విషయంపై చర్చ జరుగుతోంది. తెలుగు సినిమా తనకు సరిపడదంటూ ఆయన బాలీవుడ్ కు బిచానా ఎత్తేశారు. దాదాపు పదకొండేళ్ల పాటు బాలీవుడ్ లో తన ట్రెండ్ ను సెట్ చేసుకున్నారు. తన ట్రేడ్ మార్కును సృష్టించుకున్నారు. సడెన్ గా 11 ఏళ్ల తర్వాత ఆయన టాలీవుడ్ లోకి ప్రవేశించి డైరెక్టు చిత్రం తీస్తున్నారు. ఇది టాలీవుడ్ ను ఆశ్చర్యపరిచే విషయమే.

హీరోయిజం, ఫైటింగులు వంటి తెలుగు మూస తెలుగు చిత్రాలు తనకు సరిపడవంటూ తనదైన శైలిలో తెలుగు సినిమాలను కూడా ఆయన నిర్మించారు. శివ చిత్రంతో తన ముద్ర వేశారు. గోవిందా, గోవిందా వంటి చిత్రాలూ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ కూడా తన ముద్రను బలంగానే వేశారు. దయ్యాలు, ప్రేమ, సెక్స్ వంటి పదార్థాలను సినీ రంగంలోకి తెచ్చి పెట్టారు. హీరోయిన్ అందాలను ఆరబోయడానికి ఇచ్చిన శ్రద్ధ హారర్ కు కూడా ఇచ్చారు. కొన్ని రియల్ సబ్జెక్టులతో సినిమాలు తీసి మెప్పు పొందారు. ఏడాదికి సగటును ఏడు సినిమాలు చేశారు. ఫ్లాప్, హిట్లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తూనే వెళ్లారు.

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు సినిమాతో ఆయన తిరిగి తెలుగు చిత్రరంగంలో కాలు పెట్టారు. అదీ సునీల్ హీరోగా సినిమాకు శ్రీకారం చుట్టారు. మర్యాద రామన్న వంటి కొన్ని చిత్రాల విజయంతో ఆయనకు తెలుగు ప్రేక్షకుల అభిరుచి మారిందని అర్థమై ఉంటుంది. సినిమాకు మాస్ అప్పీల్ అవసరం లేదని, కథ బాగుంటే ఆడుతుందని నమ్మకం కుదిరి ఉంటుంది. తెలుగులో డైరెక్టు చిత్రం చేయడానికి అదో కారణమని చెబుతున్నారు. దానికి తోడు, బాలీవుడ్ తర్వాత ఎక్కువ మార్కెట్ ఉంది తెలుగు సినిమాకే. దీన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఉంటారు. ఏమైనా, వర్మ తెలుగు డైరెక్టు చిత్రం టాలీవుడ్ ట్రెండ్ ను మార్చేసుందా, వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+