టాలీవుడ్ కు 'డ్రగ్' గుబులు

సినీ ప్రపంచంలో చాలా మందికి రఘుబాబు, భరత్ రాజ్ మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తుంటారనే అనుమానాలున్నాయి. పోలీసుల వద్ద ఉన్న 60 పేర్లు ఎవరవనేది సినీ ప్రముఖులు భుజాలు తడుముకుంటున్నారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల కుమారులు, కూతుళ్లు ఉన్నట్లు భావిస్తున్నారు. పబ్ లు కూడా మాదక ద్రవ్యాలకు కేంద్రాలుగా మారుతున్నాయని అంటున్నారు. మాదక ద్రవ్యాలకు హైదరాబాదులోని 9 పబ్ లు నిలయంగా మారినట్లు అనుమానిస్తున్నట్లు ఖాన్ చెప్పారు. వాటిపై నిఘా పెట్టామని అంటున్నారు.
హైదరాబాదులోని బంజారాహిల్స్, జూబిలీ హిల్స్ వంటి సంపన్న వర్గాలు గల ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. యువతులు కూడా వీటి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాల వాడకం వళ్ల యువతులు స్పృహ తప్పుతున్నారని, అత్యాచారాలు జరిగే ప్రమాదం ఉందని ఖాన్ హెచ్చరించారు. మొత్తమ్మీద రఘుబాబు, భరత్ రాజ్ పట్టుబడడంతో ఆ గొడవ ఎవరిని, ఎంత మందిని చుట్టుకుట్టుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications