తారల ఇమేజే పెట్టుబడి

గతంలో భువనేశ్వరి అనే వర్ధమాన తార కూడా సెక్స్ రాకెట్ లో పోలీసులకు చిక్కింది. భువనేశ్వరి ఏకంగా ఓ బ్రోతలే నడిపిందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఇలాంటి వారు సినీ పరిశ్రమలో చాలా మంది ఉన్నారని అంటారు. అలాగే, విజయలక్ష్మి అలియాస్ సీమా కూడా వ్యభిచారం కేసులో పట్టుబడింది. ఆమె తన తల్లితో పాటు పోలీసులకు చిక్కింది. సైరాభాను, జ్యోతిల వ్యవహారంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. తమిళ, తెలుగు నటి రంజిత గురించి అందరికీ తెలిసిందే. స్వామి నిత్యానందతో సెక్స్ చేస్తూ ఆమె వీడియోకు చిక్కింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.
అసలు మొత్తం సినీ పరిశ్రమ తీరుతెన్నులే మారిపోయాయి. వలువలు విప్పేసి విలువలకు తిలోదకాలిస్తున్న వైనాన్ని చూస్తున్నాం. టీవీల్లో, సినిమాల్లో అంగాంగ ప్రదర్శన తప్పనిసరి సరుకుగా మారింది. ఈ ధోరణలు బయట కూడా కనిపిస్తున్నాయి. టీవీల్లో, సినిమాల్లో నటించిన తారల మీద బయటి ప్రపంచానికి మోజు ఎక్కువ ఉంటుంది. వారితో పొందు కోసం ఎన్ని డబ్బులైనా పెట్టే వారుంటారు. ఆ మోజును క్యాష్ చేసుకుంటున్నవారు ఉన్నారు. ఇందులో తారలు సమిధలే. బతుకు దెరువు కోసమో, అత్యానిధుక లైఫ్ స్టయిల్ కోసమో, వేషాల కోసం డబ్బులకు ఆశపడి ఈ రొంపిలోకి దిగుతున్నవారు తారలు. అన్ని రంగాల్లో ఇటువంటి పోకడలుంటాయి. అయితే సినిమా అనే సరికి అది అత్యంత ఆకర్షణీయమైన ప్రపంచం. అందువల్ల ఆ రంగంలోని సంఘటనలు ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. దీన్ని సొమ్ము చేసుకోవడానికి మీడియా ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications