జగన్ వైపు వంగవీటి రాధ?

వైయస్ జగన్ పార్టీ పెడుతుండడంతో ఆ పార్టీలో చేరే విషయంపై ఆయన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వైయస్ జగన్ పార్టీ కోసం విజయవాడలో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ వైయస్ జగన్ పార్టీలో చేరేందుకు ఇది వరకే నిర్ణయించుకున్నారు. జగన్ పార్టీ కోసం బందర్ రోడ్డులో ఓ భవనాన్ని తీసుకున్నారు. పార్టీలోకి వంగవీటి రాధాకృష్ణ వస్తే వైయస్ జగన్ కు అసెట్టే అవుతుంది.
తెలుగుదేశం పార్టీలో వల్లభనేని వంశీ, దేవినేని ఉమామహేశ్వర రావు వంటివారు ఆధిపత్యం చలాయిస్తుండగా, కాంగ్రెసులో దేవినేని నెహ్రూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వైయస్ జగన్ సమర్థిస్తూ వచ్చిన కాంగ్రెసు శాసనసభ్యులు జోగి రమేష్, మల్లాది విష్ణు మెల్లగా పక్కకు తప్పుకున్నారు. దీంతో వంగవీటి రాధాకృష్ణ జగన్ పార్టీలో చేరడానికి ఏ విధమైన అడ్డంకులుండవని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications