తెలుగు హీరో గట్స్

Vedam
తెలుగు సినిమాలో దమ్మున్న హీరోలే లేరని, తెలుగు సినిమా హీరోలకు గట్స్ లేవని ప్రముఖ నిర్మాత భరద్వాజ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. వేదం సినిమా విషయంలో ఆ వ్యాఖ్యలకు ప్రాధాన్యం చేకూరింది. దర్శకుడు రాధాకృష్ణ తీసిన వేదం సినిమాపై సర్వత్రా చర్చ జరుగుతూనే ఉంది. మల్టీ సారర్ చిత్రం కావడం వల్ల, హీరోయిన్ అనుష్క వేశ్య పాత్రలో నటించడం వంటి కారణాల వల్ల కూడా వేదం సినిమా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. క్రేజ్ ఉన్న అల్లు అర్జున్ ఓ సాదా సీదా పాత్రను పోషించడం ఈ సినిమా మరో ప్రత్యేకత. వీటన్నింటికీ మించి రొటీన్ మాస్ మాసాలాకు భిన్నంగా వైవిధ్యభరితమైన సినిమాగా సినీ విశ్లేషకుల నుంచి ఇది ప్రశంసలు అందుకుంటోంది.

అసలు విషయానికి వస్తే, భరద్వాజ తెలుగు సినిమాలో దమ్మున్న హీరోలు లేరని అన్నారని, వేదం సినిమా చూసిన తర్వాత ఏ విధమైన గట్స్ ఉన్నాయో అర్థమవుతుందని సినిమాకు సంగీతాన్ని సమకూర్చిన కీరవాణి సవాల్ చేస్తున్నారు. తాను ఆ మాటలు అనడాన్ని ప్రస్తావిస్తూ వేదం సినిమాను భరద్వాజ ఆహ్వానించారు. వేదం సినిమా తెలుగులో ప్రయోగమేమీ కాదని, అయితే రొటీన్ కు భిన్నమైన సినిమా అని ఆయన అన్నారు. ఆయన సినిమాను సరిగానే అంచనా వేశారు.

వేదం సినిమా హీరోగా దర్శకుడు (క్రిష్)నే చెప్పుకోవాలి. దర్శకులు ప్రయోగాత్మక సినిమానో, వైవిధ్యభరితమైన సినిమానో తీయాలనుకున్నప్పుడు అందులో నటించడానికి ముందుకు వచ్చే హీరోలు కచ్చితంగా ఉంటారు. అగ్రహీరోలుగా పేరు సంపాదించుకున్న వారు కొంత మంది ఇమేజ్ ను కాపాడుకోవడానికో, మరెందుకో గానీ అటువంటి సినిమాలకు అంగీకరించరనేది అందరికీ తెలిసిన వాస్తవమే. భిన్నమైన సినిమాలను కమర్షియల్ టచ్ తో తీయవచ్చునని, అందులో సామాజిక ప్రయోజనాన్ని కూడా సాధించవచ్చునని హిందీలో అద్భుతంగా నిరూపించిన నటుడు అమీర్ ఖాన్. ఈ హీరో వంటి హీరోలు తెలుగులో లేరనేది మాత్రం వాస్తవం.

దర్సకుడు రాధాకృష్ణ గమ్యం చిత్రం సామాజిక సమస్యలను తీసుకుని కమర్షియల్ టచ్ ఇవ్వవచ్చునని బాగా నిరూపించింది. చెప్పాలంటే గమ్యం తెలుగు సినిమాకు ఓ దారి చూపించాల్సింది. ప్రయోగాత్మక సినిమాలు తీసి చేతులు కాల్చుకోకుండా, సామాజిక ప్రయోజనంతో కమర్షియల్ గా హిట్ అయ్యే విధంగా సినిమాలు తీయవచ్చునని, అయితే అందుకు సినిమాలోని అన్ని విభాగాల్లో ప్రతిభ ప్రదర్సించాల్సి ఉంటుందని గమ్యం సినిమా నిరూపించింది. అయితే వేదం గమ్యానికి కొంచెం అటూ ఇటుగానే ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+