వర్మ 'నా ఇష్టం'లో ఏం ఉంది?

ముఖ్యంగా ఈ పుస్తకంలో రామూఇజం(వర్మ సిద్దాంతాలు),రామూ ఆలోచనలు, రామూ సినిమాలు, రామూ విజయాలు, అపజయాల విశ్లేషణలకి స్ధానం ఉంటుంది. రామూఇజంలో భాగంగా ప్రముఖ జర్మనీ తత్వవేత్త నీషే ని ఆయన ఈ పుస్తకంలో ప్రస్దావించనున్నారు. దానితో పాటు అయాన్ రాండ్ రాసిన ఫౌంటిన్ హెడ్ ని తన జీవితానికి ఏ విధంగా అప్లయ్ చేసుకున్నారో, అందులోంచి తానేం తీసుకున్నారో, అది తన విజయానికి ఏ విధంగా దోహదం చేసిందో చెప్పనున్నారు. వీటిన్నటితో పాటు రామ్ గోపాల్ వర్మ జీవితానికి, సినిమాలకు సంభందించిన కొన్ని ఫోటోలు, అరుదైన వర్కింగ్ స్టిల్స్ కూడా ఈ పుస్తకంలో చోటు చేసుకోనున్నాయి. ఇక ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేస్తున్న ఎమొస్కో వారే ఆవిష్కరించనున్నారు. ఇక ఈ పుస్తకాన్ని అంకితం చేసేది మరెవరికో కాదు..ఆయనకే. ఈ పుస్తకం మొదట్లో...అంకితం-నాకే అని ఉంటుంది.
ప్రతీ విషయంలోనూ వివాదం చేసి ఆసక్తి రేపే వర్మ ఈ సారి కూడా తనదైన మార్కెటింగ్ స్టాటజీని వినియోగిస్తున్నాడంటున్నారు. ఈ నాఇష్టం పుస్తకాన్ని ఆయన సినిమా రేంజిలో ప్రమోట్ చేయనున్నారు. ఈ పుస్తకావిష్కరణ ఈ రోజు(బుధవారం, డిసెంబర్ 1, 2010) సాయింత్రం ఆరున్నరకి తాజా బంజారా లాన్స్ లో జరగనుంది.












Click it and Unblock the Notifications