జగన్ హెల్త్ పై రోశయ్య ఎఫెక్ట్

అవకాశం దొరికిందే తడవుగా హడావిడి చేయడం తెలుగు టీవీ న్యూస్ చానళ్లకు అలవాటైంది. వెంటనే ఓ న్యూస్ చానెల్ జ్యోతిష్యులను పిలిపించి చర్చా కార్యక్రమం నిర్వహించింది. రోశయ్య, జగన్ లవి అపోజిట్ స్టార్స్ అని, పాత సంబంధాల వల్ల వారిద్దరి ఆరోగ్యానికి పరస్పరం సంబంధం ఉంటుందని ఆ పండితులు జోస్యం చెప్పారు. రోశయ్య ఆరోగ్యం బాగున్నంత వరకు జగన్ కు మంచి పదవులు గానీ మానసిక ప్రశాంతత గానీ సాధ్యం కాదని కూడా వారు తేల్చేశారు. ఒక్కసారి టీవీ చానెల్ లైవ్ లోకి వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడవచ్చునని జ్యోతిష్య పండితులకు తెలుసు.
తాను కోలుకూడదని మీడియా అనుకుని ఉండవచ్చునని రోశయ్య వ్యాఖ్యానించడాన్ని కూడా ఆ పండితులు వదిలి పెట్టలేదు. కొన్ని అతీంద్రియ శక్తులు అటువంటి ప్రకటనలు చేయడానికి పురికొల్పుతాయని కూడా చెప్పేసారు. జ్యోతిష్యపండితుల అభిప్రాయాలను హేతువాదులు నమ్మకపోవచ్చు గానీ ప్రేక్షకులకు ఏదో ఒకటి ఆసక్తికరంగా అందించాల్సిన అనివార్యతలో టీవీ చానెళ్లు పడినట్లు ఏవైనా ప్రసారం కావచ్చు.












Click it and Unblock the Notifications