వైయస్ జగన్ ముందస్తు దూకుడు

YS Jagan
వైయస్ జగన్ ఊహించినదాని కన్నా ఎక్కువ దూకుడుతో ముందుకు సాగుతున్నారు. 2014 ఎన్నికలే తమ లక్ష్యమని వైయస్ జగన్ వర్గీయులు పదే పదే చెబుతున్నారు. ఆయితే, దాని కన్నా ముందే తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో వైయస్ జగన్ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెసులోని అసంతృప్తిని పూర్తిగా తన వైపు తిప్పుకునేందుకు జిల్లాలవారీగా ఆయన పావులు కదుపుతున్నారు. వైయస్ జగన్ వర్గీయులు కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెసు శాసనసభ్యులతో, ద్వితీయ శ్రేణి నాయకులతో రహస్యంగా సంప్రదింపులు జరుపుతున్నారు. సంప్రదింపులు సానుకూలంగా సాగితే వైయస్ జగన్ ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తన పార్టీలోకి వస్తే అధికారం ఖాయమనే ధీమాను కల్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం వైయస్ జగన్ కు లేదని ఆయన వర్గానికి చెందిన నాయకులు పదే పదే చెబుతున్నారు. అయితే, ఈ మాటలను నమ్మాల్సిన అవసరం లేదు. తన తండ్రి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని తాను నడిపించేందుకు కూడా ఆయన పథకాలు రచించి, అమలు చేయవచ్చు. సాధ్యమైనంత ఎక్కువ మంది శాసనసభ్యులను తన వైపు తిప్పుకునే తన ప్రయత్నాలను ఆయన విరమించుకోలేదనే చెప్పాలి. 2014 లోపలే ఆయన అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైనంత మేర దూకుడుగా వ్యవహరించవచ్చు. ప్రజారాజ్యం, తెలుగుదేశం శాసనసభ్యులను కూడా ఆయన తన వైపు తిప్పుకునేందుకు వెనకాడకపోవచ్చు. ఇప్పటికే, కొంత మంది ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు జగన్ కు అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ లోపల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం స్థిరంగా నడవకుండా ఎప్పటికప్పుడు తిప్పలు పెట్టడం నిరంతరం ఆయన సాగించే కార్యక్రమం. డిసెంబర్ 31వ తేదీ తర్వాత, అంటే శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పెద్ద సవాల్ నే ఎదుర్కోవాల్సి ఉంటుందనేది అందరి అంచనా. ఆ సవాల్ ను ఎదుర్కునే క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి కావచ్చు కూడా. ఈ స్థితిలో తన పాచికలను వేయాలని కూడా వైయస్ జగన్ అనుకుంటూ ఉండవచ్చు. తెలంగాణ, సీమాంధ్ర శాసనసభ్యులు తిరిగి రెండుగా చీలిపోయే రాజకీయ వాతావరణం ఏర్పడవచ్చునని భావిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సిఫార్సులు ఏ విధంగా ఉన్నా అది తప్పదని అనుకుంటున్నారు. దీన్ని సమర్థంగా వాడుకుని తాను లాభపడే ఉద్దేశంతో వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు లభించే ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. పైగా తానే అస్థిరపరిచే కార్యక్రమాలకు దిగుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+