జగన్ ఓదార్పుపై నీలినీడలు?

వైయస్ జగన్ వర్గానికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు నెల్లూరు జిల్లాలో మకాం వేశారు. అయితే, ఓదార్పు యాత్రను వాయిదా వేసే ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అక్టోబర్ మొదటివారంలో జగన్ నెల్లూరు జిల్లాలో ప్రవేశించాల్సి ఉంది. కానీ ఓదార్పు యాత్రను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే, 15వ తేదీ తర్వాతనైనా జగన్ ఓదార్పు యాత్ర సాగుతుందా అనేది అనుమానమే. వైయస్సార్ విగ్రహాల ప్రతిష్టాపనలో ఇంతకు ముందు ఎదురు కాని వ్యతిరేకత నెల్లూరు జిల్లాలో ఎదరువుతోంది. వివాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి. అధిష్టానం జగన్ వర్గీయులపై వరుసగా చర్యలు తీసుకునేందుకే మొగ్గు చూపుతోంది. వైయస్ జగన్ ను నమ్మి ఎంత మంది పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారనేది అనుమానమే.
ఓదార్పు యాత్ర వద్దని అధిష్టానం చెప్పలేదని జగన్ వర్గీయులు చేస్తున్న వాదనకు కూడా గండి పడింది. పార్టీ కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్పష్టంగా చెప్పారు. ఓదార్పు యాత్రను విడిగా ప్రస్తావించకుండా ఆ విధంగా చెప్పారు. అందులో ఓదార్పు యాత్ర కూడా ఉంటుందనేది వేరుగా చెప్పాల్సిన అవసరం లేకుండా ఆయన చెప్పారు. పార్టీ తీసుకుంటున్న చర్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉంది. అందువల్ల జగన్ ఓదార్పు యాత్రపై నీలినీడలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications