వైయస్ జగన్ ది ఎన్టీఆర్ స్లోగన్

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెసు అధిష్టానం దెబ్బ తీస్తుందని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించవచ్చు. సోనియా రాష్టంలో కీలుబొమ్మలకే పెద్ద పీట వేస్తున్నారని, దాని వల్ల రాష్ట్రంలో కాంగ్రెసు మట్టి కొట్టుకుపోతుందని జగన్ వర్గీయులు ఇప్పటికే చెబుతున్నారు. కాంగ్రెసుకు ఆంధ్రప్రదేశ్ లో బీహార్ లో పట్టిన గతే పడుతుందని ఇప్పటికే వారు జోస్యం చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీపై కన్నా వైయస్ జగన్ కాంగ్రెసుపైనే ఎక్కువగా దాడులు చేసేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు.
కాగా, హైదరాబాదులో తన పార్టీపై కసరత్తు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసుగా తన పార్టీకి నామకరణం చేస్తారని అంటున్నారు. తిరుపతికి చెందిన నాయకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనాలోచితంగా ఈ పేరును వైయస్ జగన్ పార్టీగా చెప్పారు. పార్టీ పేరు ఖాయం కావడం వల్లనే అనుకోకుండా ఆ పేరు ఆయన నోటికి వచ్చిందని అంటున్నారు. వైయస్సార్ రాష్ట్రీయ కాంగ్రెసు పేరును కూడా వైయస్ జగన్ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఏమైనా, కాంగ్రెసును మట్టి కరిపించేందుకు వైయస్ జగన్ కదనకుతూహలంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications