వైయస్ భగీరథుడు రెడీ

వైయస్ రాజశేఖర రెడ్డి పాత్రను వినోద్ కుమార్ అనే నటుడు పోషించాడు. వైయస్ సతీమణి విజయమ్మ పాత్రను యమున పోషించింది. యాదగిరి సంగీతం అందించగా, గిరిరెడ్డి దర్శకత్వం అందించారు. తనకు సినీ నిర్మాణంలో అనుభవం లేదని, అయితే మనసు ఉంటే ఏదైనా చేయవచ్చునని వైయస్ నేర్పిన పాఠంతోనే తాను ఈ పనికి పూనుకున్నానని గిరి రెడ్డి చెబుతున్నారు.
సినిమాను తాము కమర్షియల్ యాంగిల్ తో చేయలేదని, ప్రజా బంధువుగా వైయస్సార్ వ్యక్తిత్వాన్ని చూపించడానికి ప్రయత్నించానని గిరిరెడ్డి అన్నారు. వైయస్సార్ ను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూడలేదని, అంతకు ముందు ఓసారి చూశానని వినోద్ కుమార్ అన్నారు. వైయస్సార్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన భగీరథుడు కమర్షియల్ గా విజయవంతం అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications