యండమూరికి ప్రేమ తిప్పలు

Yandamuri Veerendranath
ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ మరోసారి ప్రేమ తిప్పలు పడ్డాడు. యండమూరి రచనలు అంటే పడి చచ్చే విశాఖపట్నం జిల్లా అక్కిరెడ్డిపల్లికి చెందిన ఓ ఉపాధ్యాయురాలు గత పదేళ్లుగా యండమూరికి ఉత్తరాలు రాయడం, ఫోన్ చేసి మాట్లాడటం చేస్తోంది. అ తర్వాత ఒకటి రెండు సార్లు స్వయంగా తన అభిమాన రచయితను కూడా కలుసుకుంది. అయితే సదరు ఉపాధ్యాయినిలోని అభిమానం కాస్త ముదిరి ప్రేమలో పడి పోయింది. దీంతో ఆమె గత కొన్నాళ్లుగా యండమూరికి ప్రేమ కవితలు సంక్షిప్త సందేశం(ఎస్ఎంఎస్)లలో పంపడం ప్రారంభించింది. నీ కోసమే పుట్టానని, నీ కోసమే జీవిస్తున్నానని, పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటూ సదరు టీచరమ్మ యండమూరికి సందేశాలు పంపించడం ప్రారంభించింది.

దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన యండమూరి ఆమెకు మొదట నచ్చజెప్పాలని చూశాడు. అయితే ఆమె వింటే కదా. ఆమెపై సామ, ధాన, బేద, దండోపాయాలు ప్రయోగించాడు. పోలీసులకు చెబుతానని హెచ్చరించాడు. పోలీసులకు చెప్పినా దేవుడే దిగి వచ్చినా మిమ్మలన్ని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోనని ఆమె ఒత్తిడి తేవడం ప్రారంభించింది. తనకు పిల్లలు ఉన్నారు బాబోయ్ అంటున్నా ఫరవాలేదు అడ్జెస్ట్ అనేసిందంట. ఇక విసిగి వేసారి పోయిన యండమూరి చేసేది లేక విశాఖ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పది రోజుల క్రితం ఆమెను అరెస్టు చేశారు. గురువారం కోర్టులో హజరు పరిచారు. అయితే యండమూరి గతంలో కూడా ప్రేమ తిప్పలు పడ్డాడు.

గతంలో ఓ కూడా ఓ యువతి యండమూరి వీరేంద్రనాథ్‌ను ప్రేమించానని, తనను ఆయన ప్రేమించి మోసం చేశాడని లెటర్ రాసి ఆత్మహత్య కూడా చేసుకున్నది. మొత్తానికి యండమూరి తను రాసిన వెన్నెల్లో ఆడపిల్ల నవలా కష్టాలు పడ్డాడు. అయితే ఆయన ఎదుర్కొన్నది ఆ నవలకు కాస్త రివర్స్‌గా ఉండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+