అశ్విన్‌కు ఇది పెళ్లి కానుక

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచును భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచు తొలి ఇన్నింగ్సులో మూడు వికెట్లు తీసుకున్న అశ్విన్ రెండో ఇన్నింగ్సులో ఆరు వికెట్లు కూల్చాడు. ఈ నెల 13వ తేదీన పెళ్లి చేసుకోబోతున్న అశ్విన్ తన ప్రవేశం ఇంత బాగా జరుగుతుందని ఊహించలేదని అంటున్నాడు. తాను వికెట్లు తీసుకోవాలని అనుకున్నానని, అయితే ఇన్ని వికెట్లు తీసుకుంటానని అనుకోలేదని, ఇది తనకూ తన కాబోయే భార్యకు బహుమతి అవునో కాదో తనకు తెలియదని, పెళ్లికి ముందు ఇంత మంచి ప్రదర్శన చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అశ్విన్ అన్నాడు. అవతలి వైపు నుంచి ప్రజ్ఞాన్ ఓఝా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెట్టడం వల్ల తనకు అన్ని వికెట్లు దక్కాయని అశ్విన్ అన్నాడు.












Click it and Unblock the Notifications