జగన్, చిరుల ఫ్యూచర్‌పై దధీచి

Dadheechi
వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, మెగా తనయుడు రామ్ చరణ్ తేజ భవిష్యత్తుపై ప్రముఖ ఆస్ట్రేలియన్ జ్యోతిష్కుడు దధీచి గమ్మత్తైన జ్యోస్యం చెప్పారు. ఇటీవలే కాంగ్రెసు పార్టీని వీడి వైయస్సార్సీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి త్వరలో ఎవ్వరూ ఊహించని పార్టీలో చేరతారట. జగన్ తిరిగి కాంగ్రెసులో చేరతారా, భారతీయ జనతా పార్టీలో కలుస్తారా అనే విషయాలు తరుచూ చర్చకొస్తున్న విషయం తెలిసిందే. అయితే జగన్ మాత్రం భవిష్యత్తులో ఎవరూ ఊహించని పార్టీలో చేరతారని దధీచి జోస్యం చెప్పారు. ఇక సినిమాలలో తిరుగులేని కథా నాయకుడు మెగాస్టార్ చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని ఇటీవలె కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు. అయితే ఆయన ఒక్క దగ్గరే స్థిరంగా ఉండరట. నిత్యం పార్టీలు మారే బాపతట. ఆయన ముందు ముందు కాంగ్రెసును వీడి మరో పార్టీలో చేరతారని ఆ జ్యోతిష్కుడు చెప్పాడు.

అలాగే వచ్చే ఏడాది చిరంజీవికి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందరూ ఊహించుకుంటున్నట్లుగానే పదవి గండం ఉంటుందని చెప్పారు. ఆయనకు ఏ క్షణంలోనైనా పదవి గండం ఉండవచ్చట. అలాగే ఆరోగ్య పరంగానూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమాన్ని చూస్తున్న వారెవరూ ఇప్పట్లో ఇది చల్లారదనే అనుకుంటారు. కానీ దధీచి మాత్రం త్వరలో ఈ ఉద్యమం ముగుస్తుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఇంత ఉధృతంగా ఉన్నప్పటికీ ఎక్కువ కాలం కొనసాగదని త్వరలోనే చల్లారుతుందని చెప్పారు. ఇక దేశ రాజకీయాలలోకి వెళితే ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదట. అయితే 2014లో అందరూ అనుకుంటున్నట్టుగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మాత్రం ప్రధాని అయ్యే అవకాశం లేదని తేల్చేశారు. స్వతహాగా రాజకీయాలపై రాహుల్‌కు పట్టులేదన్నారు.

మరోవైపు భారత దేశం ప్రపంచంలో సూపర్ పవర్ అవుతుందని చెప్పారు. 2014 - 2020 నాటికి భారత్ ఆ స్థాయికి ఎదుగుతుందని అలాగే అమెరికా సైతం ఆర్థిక సంక్షోభం నుండి బయట పడుతుందని చెప్పారు. మెగా తనయుడు రామ్ చరణ్ తేజకు వచ్చే సంవత్సరం చాలా బాగుంటుందట. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం కొద్దిగా బాధాకరంగానే ఉంటాయని చెప్పారు. ఇదే సంవత్సరం రామ్ చరణ్ పెళ్లి అవుతుంటడం విశేషం. కాగా మన వారి భవిష్యత్తు గురించి చెప్పిన ఈ ఆస్ట్రేలియన్ జ్యోతిష్యుడు చెన్నై గురువుల నుండి ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు. 25 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+