పరమవీర చక్రకు చిరంజీవి అడ్డంకులు?

Parama Veera Chakra
ప్రముఖ హీరో నటించి, ప్రముఖ దర్శకుడు నిర్మించిన చిత్రానికి కూడా కష్టాలు తప్పడం లేదని తెలుస్తోంది. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన బాలకృష్ణ సినిమా పరమవీర చక్ర విడుదలకు కూడా ఆటంకాలు వస్తున్నాయట. ఈ విషయాన్ని దాసరి నారాయణరావు వర్గానికి చెందిన నిర్మాత నట్టి కుమార్ అంటున్నారు. ఇందులో ఓ ప్రముఖ హీరో కుట్ర ఉందని ఆయన అన్నారు. ఆ ప్రముఖ హీరో ఎవరనేది ఆయన చెప్పడం లేదు. కానీ ఆ ప్రముఖ హీరో చిరంజీవి అనే విషయం ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. నట్టి కుమార్ ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో విస్తృతంగా మాట్లాడారు.

పరమవీర చక్రకు థియేటర్లు దొరకకుండా ఓ ప్రముఖ హీరో కుటుంబం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. అన్నింటిలోనూ ఆ హీరో కుటుంబం అడ్డొస్తోందని ఆయన అన్నారు. చిరంజీవి కుటుంబంపై గతంలో నట్టి కుమార్ తీవ్రంగా ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఫైటర్ల తగాదా విషయంలో కూడా ఆయన ఆ కుటుంబాన్నే విమర్శించారు. నట్టి కుమార్ దాసరి నారాయణరావు వర్గానికి చెందినవారనే విషయం తెలిసిందే.

చాలా కాలంగా దాసరి నారాయణరావుకు, చిరంజీవికి పడడం లేదనే ప్రచారం జరుగుతోంది. పరమవీర చక్ర సినిమాకు సినీ రంగంలోని కొంత మంది భయపడుతున్నారని సీనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నాయకులు అంటున్నారు. అందువల్లనే సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. బాలయ్య నటించి, దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన సినిమాకే అడ్డంకులు ఎదురవుతున్నాయంటే మిగతావారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+