వర్మ బెజవాడకు 'వంగవీటి' చిక్కులు

తమ అభిమాన నేతలను తక్కువగా చేసి చూపిస్తే చిత్రాన్ని ఎక్కడా ఆడనివ్వబోమని చెబుతున్నారు. విజయవాడ పేరు చెబితే వంగవీటి రంగా పేరు ఎవరికైనా గుర్తుకు వస్తుంది. అలాంటి తమ నేతను తక్కువ చేసి చూపిస్తే ఊరుకునేది లేదంటున్నారు. ప్రముఖ తమిళ నటుడు ప్రభు ఈ చిత్రంలో రంగాగా కనిపించనున్నారని తెలుస్తోంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావును కించపర్చేలా రక్తచరిత్ర-1లో, మరో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని కించపర్చేలా రక్తచరిత్ర-2లో సన్నివేశాలు ఉన్నాయని టిడిపి, వైయస్ అభిమానులు ఆందోళన చేశారు. తాజా బెజవాడ చిత్రం వంగవీటి అభిమానులకు మనస్థాపం కలిగించేలా ఉందంటున్నారు.












Click it and Unblock the Notifications