జూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు చెక్?

కాగా, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అతను సినిమాలను తగ్గించుకోవడానికి కనీసం పదేళ్లయినా పడుతోంది. ఈ పదేళ్ల లోపు అతను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. నందమూరి హరికృష్ణ ముందుకు వచ్చి పార్టీ నాయకత్వం చేపట్టే స్థితి కూడా లేదు. హరికృష్ణకు తగిన సమర్థత కూడా లేదు. పార్టీ నాయకులు అందుకు అంగీకరించే అవకాశం లేదు. ఇప్పుడిప్పుడే సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చే సాహసం జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడని అనుకోలేం. అందువల్ల నారా లోకేష్‌ను అడ్డుకుని జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేవు. వచ్చే పదేళ్ల కాలంలో, అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు దృష్టి సారించాలని అనుకునే సరికి నారా లోకేష్ నాయకుడిగా స్థిరపడిపోతారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏ విధమైన ఆటంకాలు ఉండవని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని అనుకుంటే మాత్రం కాస్తా తేడా రావచ్చు. కానీ, లోకేష్‌ను అల్లుడిగా చేసుకున్న బాలకృష్ణ అందుకు సాహసించకపోవచ్చు. ఇప్పటికే, చంద్రబాబు, బాలకృష్ణల మధ్య ఒక అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, కుమారుడు నారా లోకేష్‌కు చంద్రబాబు లైన్ క్లియర్ చేసి పెట్టారు. పార్టీ ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా నారా లోకేష్‌ను సమర్థించేవారే. అంటే చంద్రబాబు మాటకు కట్టుబడి ఉండేవారే. నామా నాగేశ్వర రావువంటి నాయకులు నారా లోకేష్‌కే మద్దతు తెలుపుతారు.












Click it and Unblock the Notifications