వైయస్ జగన్‌తో చంద్రబాబు ఢీ

చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించడం లేదని, కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే చంద్రబాబు ఆ పని చేయడం లేదని వైయస్ జగన్ పదే పదే అంటున్నారు. చంద్రబాబును రెచ్చగొట్టడానికే వైయస్ జగన్ ఆ వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాన్ని పడగొట్టడం తన వల్ల సాధ్యం కాదు కాబట్టి చంద్రబాబు ద్వారా ఆ పని చేయించాలని జగన్ వ్యూహం కావచ్చు. కానీ, చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని మేళవించి జగన్‌కు సమాధానం ఇచ్చారు.
తనకు మద్దతు ఇస్తున్న శానససభ్యులతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గవర్నర్ వద్దకు వెళ్లాలని, అప్పుడు గవర్నర్ బలపరీక్షకు ఆదేశించే అవకాశం ఉంటుందని, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేస్తామని ఆయన అన్నారు. అంటే, సాంకేతికమైన సమాధానం మాత్రమే చంద్రబాబు ఇచ్చారు. రాజకీయంగా ఎదుర్కోవడానికి మాత్రమే ఆయన జగన్‌పై ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి గానీ గవర్నర్ వద్దకు వెళ్లడానికి గానీ జగన్ వద్ద తగిన సంఖ్యాబలం లేదనే విషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే జగన్‌కు చంద్రబాబు ఆ విధమైన సవాల్ విసిరారని చెప్పవచ్చు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన జగన్ పేరు ఎత్తడానికి ఇష్టపడలేదు. ఓసారి అనుకోకుండా పేరు ఉచ్చరించి వెనక్కి తగ్గి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అన్నారు. గతంలో తెలంగాణ పేరు ఎత్తడానికి ఇష్టపడని చంద్రబాబు ఇప్పుడు వైయస్ జగన్ పేరు నోటితో పలకడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications