చిరంజీవి వర్గం ఎమ్మెల్యేల్లో అసంతృప్తి?

గంటా శ్రీనివాస రావు విషయంలో పెద్దగా వ్యతిరేకత ఎదురు కానప్పటికీ రామచంద్రయ్య విషయంలో మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవి ఇచ్చే వరకు సరే గానీ, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం మాత్రం సరి కాదనే వాదన వినిపిస్తోంది. కడప జిల్లాకు చెందిన రామచంద్రయ్యకు కాంగ్రెసు నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డితో పాటు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి తదితరులు సి. రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజారాజ్యం పార్టీలో వంగా గీత వంటి సీనియర్లను పక్కన పెట్టి రామచంద్రయ్య పేరును మంత్రి పదవికి సూచించడం సమంజసం కాదని అంటున్నారు. అలాగే, తెలంగాణ నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కే అవకాశాలు లేవు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అనిల్ మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుల్లో అనిల్‌కు మంత్రి పదవి ఇవ్వాలని చిరంజీవి సూచిస్తున్నారు. కానీ అధిష్టానం సుముఖంగా లేదు. ఈ స్థితిలో కొంత మంది ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఏమైనా, ప్రజారాజ్యం పార్టీలో అసంతృప్తి వల్ల కాంగ్రెసుకు నష్టమే గానీ చిరంజీవికి పోయేదేమీ లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications