సోనియా 'చేతి'లో చిరంజీవి గిలగిల

కాంగ్రెసు చేతికి చిక్కిన చిరంజీవి ఇప్పుడు ఎటూ పోలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఒడ్డున పడిన చేపలా విలవిలలాడుతున్నారు. గతంలో అడక ముందే అపాయింట్‌మెంట్ ఇచ్చిన సోనియా ఇప్పుడు అడిగినా ఇవ్వడం లేదు. విలీన సభకు రాహుల్ గానీ, సోనియా గానీ రారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చిరంజీవికి మొహమాటం లేకుండా చెప్పేశారని అంటున్నారు. అంతేకాదు, భారీగా విలీన సభను జరపాల్సిన అవసరం లేదని, తమ పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి తీసుకుంటామని కూడా ఆయన చెప్పారట. దీంతో కంగు తినడం చిరంజీవి వంతైంది. వెనక్కి రాలేక ముందుకు పోలేక చిరంజీవి గిజగిజలాడుతున్నట్లే చెప్పాలి.
చిరంజీవికి రాష్ట్రంలో అంత సీన్ లేదని, అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని కాంగ్రెసు నాయకులెవరో సోనియాకు పూస గుచ్చినట్లు చెప్పారని సమాచారం. అంతేకాదు, చిరంజీవిని ప్రోత్సహిస్తే ఓ వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తున్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, దాని వల్ల బలమైన సామాజిక వర్గం ఒకటి దూరమయ్యే ప్రమాదం ఉందని సోనియాకు చెప్పారని సమాచారం. కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి మధ్య విభేదాలను, వైరాలను చిరంజీవిని దెబ్బ తీయడానికి వాడుకున్నట్లు చెబుతున్నారు. దానికి తోడు, రెడ్లు లేకుండా కాంగ్రెసు మనుగడ సాగించడం కూడా కష్టమని చెప్పారని తెలుస్తోంది. చిరంజీవిని ఎక్కువగా ఆదరిస్తే రెడ్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వైపు చూసే అవకాశం ఉందని కూడా చెప్పారని అంటారు. ఏమైనా, కాంగ్రెసులో ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఎవరు పైకొస్తారో, పాతాళానికి దిగజారుతారో చెప్పడం సాధ్యం కాదని మరోసారి రుజువు అయిందని చెప్పవచ్చు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications