జగన్ వర్గ ఎమ్మెల్యేలతో తెర వెనక మంతనాలు

తమ వ్యూహంలో భాగంగానే వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటు విషయంలో జాప్యం చేస్తూ వస్తోంది. అనర్హత వేటు పడేవారిలో కాంగ్రెసుకు చెందినవారు 16 మంది ఉన్నారు. వారిలో కనీసం సగం మందినైనా తిరిగి తమ వైపు తిప్పుకునే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. తిరిగి తమ వైపు వస్తే అనర్హత వేటు పడదనే సంకేతాలను జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులకు సంకేతాలు అందిస్తోంది. వారితో తెర వెనక చర్చలు కూడా జరుపుతున్నట్లు వినికిడి.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో చర్చించిన తర్వాత వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల పట్ల అనుసరించాల్సిన వైఖరిని ఖరారు చేస్తారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికలను అంత పెద్ద యెత్తున ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. బొత్స సత్యనారాయణ మాత్రం దూకుడుగా వెళ్లడమే మంచిదనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. ఇద్దరి అభిప్రాయాలను తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉంది. ఏమైనా, కాంగ్రెసుకు ఉప ఎన్నికలు మరో గండమే. ఆ గండాన్ని దాటడానికి కాంగ్రెసు ఏం చేస్తుందనేది చూడాల్సిందే.












Click it and Unblock the Notifications