బాలయ్యకు దాసరి పొలిటికల్ లైఫ్?

పరమవీరచక్ర సినిమా కూడా దాదాపుగా బెబ్బులిపులి సినిమా మాదిరిగానే ఉందని అంటున్నారు. బాక్సాఫీసు వద్ద అదే విజయాన్ని సాధిస్తుందని అంటున్నారు. బెబ్బులిపులి సినిమాలో ఎన్టీ రామారావు వివిధ వీరుల వేషాల్లో కనిపిస్తారు. అదే రీతిలో పరమవీర చక్రలో బాలయ్య కనిపిస్తున్నారు. దేశాన్ని కాపాడే సైనికుడి పాత్రలో బాలయ్య కనిపిస్తాడు. అదే సమయంలో దేశంలోని దుష్టశక్తుల ఆటకట్టించే సాహసవీరుడిగా దర్శనమిస్తున్నాడు. డైలాగ్ డెలివరీలో, వాచకంలో, నటనలో ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చే విధంగా ఉందని అంటున్నారు.
బాలయ్యను డైరెక్టు చేస్తున్నప్పుడు తాను ఎన్టీ రామారావును డైరెక్ట్ చేస్తున్నట్లుగానే భావించానని దాసరి నారాయణ రావు చెప్పుకున్నారు. ఎన్టీ రామారావుకు హిట్ ఇచ్చినట్లుగానే బాలయ్యకు హిట్ ఇవ్వాలని దాసరి నారాయణ రావు పరమవీర చక్ర సినిమాకు రూపకల్పన చేశారు. సింహ సినిమాతో ఊపు మీదున్న బాలయ్యకు పరమవీర చక్ర మరింత ఉత్సాహాన్ని సమకూరుస్తుందని అంటున్నారు. పరమవీర చక్ర దాసరి ఉద్దేశించిన లక్ష్యాలను సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications