వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాసరి పొలిటికల్ జోడీ మున్నాబాయ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao
ప్రముఖ దర్శక, నిర్మాత తన కసిని తీర్చుకునేందుకు కొత్త జోడీని వెతుక్కున్నట్లు తెలుస్తోంది. ఈసారి జాతీయ స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం - కాంగ్రెసుపై కసితో ఆయన ఓ హిందీ సినిమాను తీయడానికి పూనుకున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రధాన పాత్ర పోషిస్తారట. ఈ సినిమా ద్వారా ముఖ్యమంత్రి ఎవరవుతారో చెబుతానని దాసరి అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. హిందీ సినిమా కాబట్టి ప్రధాని ఎవరవుతారో కూడా ఆయన చెప్పే అవకాశాలు లేకపోలేదు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసుకు దగ్గరవుతున్న క్రమంలో దాసరి నారాయణ రావు దూరమవుతూ వచ్చారు. ఇప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం ద్వారా కాంగ్రెసులోనే చేరుతున్నారు. దీంతో కాంగ్రెసుపై దాసరి నారాయణ రావు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు.

కాగా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లోకి దిగుతున్న సమయంలో దాసరి నారాయణ రావు మేస్త్రీ సినిమా తీశారు. ఆ సినిమాలో ఆయన నటించారు కూడా. అందుకు ఆయన ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు. ఈ సినిమాలో దాసరి నారాయణ రావు చిరంజీవి పలు సెటైర్లు వేశారు. దాసరి నారాయణ రావు చెప్పినట్లే చిరంజీవి సభలకు పెద్ద యెత్తున ప్రజలు వచ్చినప్పటికీ ప్రజారాజ్యం పార్టీ మాత్రం చతికిలపడింది. కేంద్ర మంత్రి పదవి రాజీనామా చేయాల్సిన వచ్చిన పరిస్థితిలో దాసరి రాజకీయాల తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అసంతృప్తి పేరుకుపోయి కాంగ్రెసు వ్యతిరేకతగా మారిందని గిట్టనివాళ్లు అంటారు.

దాసరి నారాయణ రావు తన ప్రయత్నాల్లో భాగంగా బాలకృష్ణతో పరమవీరచక్ర సినిమా తీశారు. స్వర్గీయ ఎన్టీ రామారావుకు బెబ్బులిపులి ఇచ్చిన విజయం ఆ సినిమా బాలకృష్ణకు ఇస్తుందని, తద్వారా రాజకీయంగా బాలకృష్ణకు ఉపయోగపడుతుందని చాలా మంది అన్నారు. కానీ, ఆ స్థాయికి అది చేరుకోలేకపోయింది. ఈ పరిస్థితిలోనే దాసరి నారాయణ రావు జాతీయ స్థాయిలో తన సత్తా చాటేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే మున్నాబాయ్‌ని పెట్టి ఓ రాజకీయ సినిమా తీయాలని భావిస్తున్నారు. సంజయ్ దత్ కూడా కాంగ్రెసు వ్యతిరేకి కావడంతో దాసరికి అది బాగా కలిసి వస్తుందని అంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో చేరి సంజయ్ దత్ చేతులు కాల్చుకున్నారు. సంజయ్ దత్‌కు రాజకీయ ఇష్టానిష్టాలు ఉండడం కూడా సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు.

English summary
It is learnt that Prominent film director Dasari Narayana Rao has decided to male a political film with Bollywood star Sanjay Dutt. It is said that Dasari is taking this film as prestigious to prove his strength at national level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X